జూన్ 2008 Archives

30. 06 2008 - నిర్గమకాండము 6:30

మోషే చిత్తగించుము; నేను మాట మాంద్యము గలవాడను, ఫరో నా మాట యెట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను.

29. 06 2008 - యోహాను 6:29

యేసు ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను.

28. 06 2008 - లూకా 6:28

మిమ్మును శపించువారిని దీవించుడి, మిమ్మును బాధించువారికొరకు ప్రార్థనచేయుడి.

27. 06 2008 - మత్తయి 6:27

మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు?

26. 06 2008 - దానియేలు 6:26-27

నా సముఖమున నియమించిన దేమనగానా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలుయొక్క దేవునికి భయ పడుచు ఆయన సముఖమున వణకుచుండవలెను. ఆయనే జీవముగల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనముకానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టున కుండును.ఆయన విడిపించువాడును రక్షించు వాడునైయుండి, పరమందును భూమిమీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోటనుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను.

25. 06 2008 - మత్తయి 6:25

అందువలన నేను మీతో చెప్పునదేమనగాఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి; ఆహారముకంటె ప్రాణము,వస్త్రముకంటె దేహమును గొప్పవి కావా?

24. 06 2008 - ఎఫెసీయులకు 6:24

మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికిని కృప కలుగును గాక.

23. 06 2008 - రోమా 6:23

ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము.

22. 06 2008 - ఆదికాండము 6:22

నోవహు అట్లు చేసెను; దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను.

21. 06 2008 - 2 సమూయేలు 6:21

నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రా యేలీయులను తన జనులమీద నన్ను అధిపతిగా నిర్ణయించు టకై నన్ను యేర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేనాలాగు చేసితిని; యెహోవా సన్నిధిని నేను ఆట ఆడితిని.

20. 06 2008 - మత్తయి 6:20

పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పై నను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు.

19. 06 2008 - 1 కొరింథీయులకు 6:19-20

జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు.

18. 06 2008 - 2 దినవృతాంతలు 6:18

మనుష్యులతో కలిసి దేవుడు భూమియందు నివాసము చేయునా? ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టచాలవే; నేను కట్టిన యీ మందిరము నిన్ను పట్టునా?

17. 06 2008 - రోమా 6:17

మీరు పాపమునకు దాసులై యుంటిరిగాని యే ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వకముగా లోబడినవారై, పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము.

16. 06 2008 - గలతీయులకు 6:16

ఈ పద్ధతి చొప్పున నడుచుకొను వారికందరికి, అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగును గాక.

15. 06 2008 - మత్తయి 6:15

మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు.

14. 06 2008 - గలతీయులకు 6:14

అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవును గాక; దానివలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువవేయబడియున్నాము

13. 06 2008 - ఎఫెసీయులకు 6:13

అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు(దేవుని) సర్వాంగ కవచమును ధరించుకొనుడి

12. 06 2008 - ఎఫెసీయులకు 6:12

ఏలయనగా మనము పోరాడునది శరీరులతో(మూలభాషలో-రక్తమాంసములతో) కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.

11. 06 2008 - రోమా 6:11

అటువలె మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తుయేసు నందు సజీవులుగాను మిమ్మును మీరే యెంచుకొనుడి.

10. 06 2008 - గలతీయులకు 6:10

కాబట్టి మనకు సమయము దొరకిన కొలది అందరియెడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము.

9. 06 2008 - 1 తిమోతికి 6:9

ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును.

8. 06 2008 - ఆదికాండము 6:8

అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను.

7. 06 2008 - గలతీయులకు 6:7

మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.

6. 06 2008 - మత్తయి 6:6

ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును.

5. 06 2008 - రోమా 6:5

మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమైన యెడల, ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగల వారమై యుందుము.

4. 06 2008 - ఎఫెసీయులకు 6:4

అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలోఉన్నాడు.

3. 06 2008 - రోమా 6:3

క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా?

2. 06 2008 - గలతీయులకు 6:2

ఒకని భారముల నొకడుభరించి, యీలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెర వేర్చుడి.

1. 06 2008 - మత్తయి 6:1

మనుష్యులకు కనబడవలెనని వారియెదుట మీ నీతి కార్యము చేయకుండ జాగ్రత్తపడుడి; లేనియెడల పరలోకమందున్న మీ తండ్రియొద్ద మీరు ఫలము పొందరు.