డిసెంబరు 2008 Archives

31. 12 2008 - లూకా 12:31

మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడ ఇవి మీ కనుగ్రహింపబడును.

30. 12 2008 - నెహెమ్యా 12:30

యాజకు లును లేవీయులును తమ్మును తాము పవిత్రపరచుకొనిన తరువాత జనులను గుమ్మములను ప్రాకారమును పవిత్ర పరచిరి.

29. 12 2008 - మత్తయి 12:29

ఒకడు మొదట బలవంతుని బంధింపనియెడల యేలాగు ఆ బలవంతుని యింటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించినయెడల వాని యిల్లు దోచుకొనును.

28. 12 2008 - హెబ్రీయులకు 12:28-29

అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, దైవ కృప కలిగియుందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవచేయుదము, ఏలయనగా మన దేవుడు దహించు అగ్నియై యున్నాడు.

27. 12 2008 - 1 కొరింథీయులకు 12:27

అటువలె, మీరు క్రీస్తుయొక్క శరీరమైయుండి వేరు వేరుగా అవయవములైయున్నారు

26. 12 2008 - యోహాను 12:26

ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించినయెడల నా తండ్రి అతని ఘనపరచును.

25. 12 2008 - హెబ్రీయులకు 12:25

మీకు బుద్ధి చెప్పుచున్నవానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమిమీదనుండి బుద్ధిచెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయినయెడల, పరలోకమునుండి బుద్ధిచెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయముగదా.

24. 12 2008 - యోహాను 12:24

గోధుమగింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును

23. 12 2008 - లూకా 12:23

ఆహారముకంటె ప్రాణమును వస్త్రముకంటె దేహమును గొప్పవి కావా?

22. 12 2008 - 1 సమూయేలు 12:22

​యెహోవా మిమ్మును తనకు జనముగా చేసికొనుటకు ఇష్టము గలిగి యున్నాడు; తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు.

21. 12 2008 - రోమా 12:21

కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము.

20. 12 2008 - 1 సమూయేలు 12:20

అంతట సమూయేలు జనులతో ఇట్లనెను-భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జింపకుండ ఆయనను అనుసరించుచు పూర్ణహృదయముతో ఆయనను సేవించుడి.

19. 12 2008 - సామెతలు 12:19

నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై యుండును అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే యుండును.

18. 12 2008 - 1 కొరింథీయులకు 12:18-20

అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్తప్రకారము శరీరములోనుంచెను. అవన్నియు ఒక్క అవయవమైతే శరీరమెక్కడ?అవయవములు అనేకములైనను శరీరమొక్కటే.

17. 12 2008 - రోమా 12:17-18

కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యు లందరి దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగి యుండుడి.శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.

16. 12 2008 - రోమా 12:16

ఒకనితో నొకడు మనస్సుకలిసి యుండుడి. హెచ్చు వాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులై యుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు.

15. 12 2008 - రోమా 12:15

సంతోషించు వారితో సంతోషించుడి;

14. 12 2008 - 1 కొరింథీయులకు 12:14

శరీరమొక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది.

13. 12 2008 - 1 కొరింథీయులకు 12:13

ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితివిు.మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతివిు.

12. 12 2008 - రోమా 12:12

నిరీక్షణగలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి.

11. 12 2008 - రోమా 12:11

ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రతగలవారై ప్రభువును సేవించుడి.

10. 12 2008 - రోమా 12:10

సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.

9. 12 2008 - రోమా 12:9

మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను. చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి.

8. 12 2008 - లూకా 12:8

మరియు నేను మీతో చెప్పునదేమనగా, నన్ను మనుష్యులయెదుట ఒప్పుకొనువాడెవడో, మనుష్యకుమారుడు దేవుని దూతల యెదుట వానిని ఒప్పుకొనును.

7. 12 2008 - సామెతలు 12:7

భక్తిహీనులు పాడై లేకపోవుదురు నీతిమంతుల యిల్లు నిలుచును

6. 12 2008 - మత్తయి 12:6

దేవాలయముకంటె గొప్ప వాడిక్కడ నున్నాడని మీతో చెప్పుచున్నాను.

5. 12 2008 - హెబ్రీయులకు 12:5

మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము

4. 12 2008 - రోమా 12:4-5

ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను, ఈ అవయవములన్నిటికిని ఒక్కటే పని యేలాగు ఉండదో, ఆలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై యున్నాము.

3. 12 2008 - 1 కొరింథీయులకు 12:3

ఇందుచేత దేవుని ఆత్మవలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను.

2. 12 2008 - రోమా 12:2

మీరు ఈ లోక( లేక, ఈ యుగ) మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి.

1. 12 2008 - రోమా 12:1

కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.