ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
మనం విరిగిన నలిగిన లోకంలో జీవిస్తున్నాం అని మనకు ఎంతో తెలుసు.దురదృష్టవశాత్తు, మన విరిగిన లోకం కూడా విరిగిన వ్యక్తులతో నిండి ఉంది.బాధ, వేదన మాత్రమే మిగిలిన రోజుల్లో, మనలను బాధపెట్టిన వారు తమ నిస్సహాయతను తెలుసుకుని బాధపడిన రోజుల్లో, మనము ఎవరివైపుకు మరలవచ్చును అనే ఆలోచనలో దేవుని కంటే వేరే మూలము మనకు లేదు.ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన వాగ్దానాలను నిలబెట్టుకున్నాడు, తన ప్రజలను రక్షించి, తన మెస్సయను పంపించాడు , అదేవిధముగా ఆయన మనతోకూడా నిలిచివుండు దేవుడు.చాల కొద్ది సందర్భాలలో దేవుడు చుడనివాడుగా ,విననివాడుగా మనయెడల శ్రద్ధ చూపనివాడుగా కనిపించవచ్చు ఆ క్షణాల్లో మనం ఏం చేస్తాం?మనకు ఏ భావాలు, ఏ సందేహాలు లేనివారిగా నటిస్తామా?లేదు, గతములో మనలను విమోచించి రక్షించి మరియు విముక్తిపరచినట్లు మన దినములలో కూడా మనము ప్రేమించిన, మనలో పనిచేయడానికి చేయుటకు ఆయనను ఆలాగుననే పిలుస్తాము మనము నిజాయితీగా ఎలుగెత్తి ఏడుస్తాము."యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యి యెత్తుము."
నా ప్రార్థన
నిరీక్షణకు కారకుడైన దేవా, భయంకరమైన మరియు చీకటితో నిండిన దినములలో మాకు దూరముగా ఉండకుము .మాకు జీవన ఆనందం మరియు మంచి విషయాల పట్ల నిరీక్షణ తిరిగి ఇవ్వండి; బాధ మరియు వేదన కాలాలలో మాకు ఓదార్పు ఇవ్వండి.మీ చేతిని ఎత్తండి మరియు మా సమయం, మా కుటుంబాలు, మా సంస్కృతి మరియు మీ సంఘమునకు మారుమనస్సు మరియు పునరుద్దరణను తీసుకురావడానికి చర్య తీసుకోండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమెన్.