ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
యేసు తన శిష్యుల దృష్టిని ఆకర్షించే విధానాన్ని నేను ప్రేమిస్తున్నాను. "మీరు వారికీ తినటానికి పెట్టండి !"అని శిష్యులతో చెప్పినప్పుడు వారు చేయలేరని వారికి తెలుసు! అయినప్పటికీ వారు తమ కొద్దిపాటి వనరులను తన వద్దకు తీసుకువస్తే వారు అద్భుతమైన పనులు చేయగలరని యేసు వారికి చూపించాడు. పెద్ద పిక్నిక్ ముగిసినతరువాత , ప్రతి ఒక్కరూ దేవుని కృపా బళ్ళనుండి మిగిలిపోయిన ఆహారంతో నిండిన బుట్టను తీసుకోవలసి వచ్చెను. మనల్ని పరిమితం చేసేది సవాలో లేదా వనరులో కాదని గుర్తుంచుకుందాం; అది మన దగ్గర ఉన్నదాన్ని యేసు వద్దకు తీసుకురావడం మరియు మనం కలలుగని విధంగా ఇతరులను ఆశీర్వదించడానికి ఆయన మనతో ఏదైనా చేస్తాడని విశ్వసించి ఇవ్వడానికి సంసిద్ధత చూపకపోవడము! (cf. ఎఫెసీయులు 3: 20-21)
నా ప్రార్థన
అబ్బా తండ్రీ, అవసరమైన సమయాల్లో మీ విపరీత సహాయం మరియు దయ కోసం, మీకు కావలసిన సమయాల్లో మీ ప్రేమపూర్వక మరియు ఉదారమైన సదుపాయానికి, మరియు నన్ను మరియు మీ సంకల్పం నెరవేర్చడానికి మీరు నాకు అప్పగించిన వనరులనుతో మీరు నన్ను ఆశ్చర్యపరిచారు. . యేసు నామంలో నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఆమెన్