ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
దేవుడు మన రక్షకుడు మాత్రమే కాదు; అతను మన సహాయకుడు. మన చుట్టూ వున్న ప్రపంచం కుప్పకూలుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఆయన అక్కడే ఉంటాడు. ఆయన మరణం నుండి మనలను విమోచించాడు లేదా మరణం గుండా విమోచించాడు . అతను చెడు నుండి మనలను విమోచించాడు, లేదా అతను చెడు అధిగమించునట్లు మనలను విమోచించాడు. భూకంపాలు మరియు వేలాది తరంగాల మధ్యలో మనం ఒంటరిగా కాదు మరియు విడిచిపెట్టబడలేదని విశ్వసించుటయే మన పని.
నా ప్రార్థన
పరిశుద్ధ దేవా , ఎవరైతే జీవితం యొక్క భూకంపాలు మధ్యలో వున్నారో నేడు వారికోసం నేను ప్రార్థిస్తున్నాను . నేను ఎవరికోసం ఆందోళన చెందుతున్నానో నీకు తెలుసు. ఉపశమనం కలిగించటము నాకు చాలా కష్టంగా వున్నను మరియు నిజముగా వారికీ నెమ్మది చేకూర్చుట నాకు చాల పెద్దదైన పని అయినను నేను వారి పోరాటాలను పట్టించుకొందునని మీకు తెలుసు. నీవు వారిని ఆశీర్వదించమని ఇప్పుడు నేను మిమ్ములను అడుగుచున్నాను, వారితో ఉండండి, మరియు త్వరగా వాటిని నుండి వారిని విమోచించండి . మీరు మా ఏకైక నిజమైన నిరీక్షణ మరియు యేసు మా ఏకైక నమ్మకమైన విమోచకుడు. ప్రభువైన యేసు క్రీస్తు నామమున నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.