ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

పౌలు బహుశా రోమన్ జైలులో మరణాన్ని ఎదుర్కొంటున్నాడు. అయితే, విశ్వాసం ద్వారా, తన జీవితం మరియు భవిష్యత్తు ప్రభువు చేతుల్లో సురక్షితంగా ఉన్నాయని అతనికి తెలుసు. హింస, కష్టాలు, మరియు హతసాక్షులు కూడా ఎదురైనప్పుడు అతను ఎలా ఉండాలో పరిశుద్ధాత్మ అతనికి శక్తినిస్తుంది. అతని అంతిమ విమోచన కొరకు ఆత్మ అన్నిటినీ కలిపి పనిచేస్తుంది (రోమా 8:28). అతను ఇతరులకు సేవ చేయడానికి జైలు మరియు మరణం నుండి విడుదల చేయబడతాడు లేదా జైలు మరియు మరణం ద్వారా తాను ప్రేమించే ప్రభువు సన్నిధిలోకి విడుదల చేయబడతాడు. ఎలాగైనా, అతను విముక్తి కోసం ఎదురు చూస్తున్నాడు మరియు ఆశిస్తున్నాడు! ఎందుకు? ఎందుకంటే అతని జీవితం మరియు భవిష్యత్తు యేసులో సురక్షితంగా ఉన్నాయి (కొలొస్సయులు 3:1-4).

నా ప్రార్థన

ఓ ప్రభువా, సర్వశక్తిమంతుడైన దేవా, నీ విమోచనపై నా నమ్మకం ఎప్పుడూ చలించకుండా ఉండటానికి దయచేసి నాకు ధైర్యాన్ని ప్రసాదించు. సంతోకరమైనది ఏమంటే, ప్రియమైన తండ్రీ, నాకు చాలా మంది ప్రియమైన స్నేహితులు ఉన్నారు, వారు శారీరక సమస్యలతో ప్రాణాలతో పోరాడుతున్నారు. దయచేసి వారికి మీ విమోచనను అనుగ్రహించుము, వారిని పూర్తి ఆరోగ్యానికి పునరుద్ధరించే మీ స్వస్థత ద్వారా లేదా వారు ఈ జీవితం నుండి యేసు సన్నిధికి వెళ్ళేటప్పుడు మీతో వారి భవిష్యత్తును నిర్ధారించే మీ కృప ద్వారా (ఫిలిప్పీయులు 1:19-24). ఎలాగైనా, తండ్రీ, నీ విజయోత్సాహపు కుమారుడైన యేసు ద్వారా నీవు వారిని విడిపించగలవని నాకు నమ్మకం ఉంది, ఆయన నామమున నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు