ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

జన సమూహాల హృదయాలను బంధించిన తరువాత, యేసు ఇప్పుడు మరొక శిష్యుడైన లేవిని(మత్తయి) పిలుస్తాడు. ఈ పిలుపు గురించి రెండు విషయాలు ముఖ్యమైనవి. మొదట, యేసు మరే ఇతర మత నాయకుడిని ఎన్నుకోలేదని, పన్ను వసూలు చేసేవాడు మరియు రోమా ప్రభుత్వ సానుభూతిపరుడని మాత్రమే పిలిచాడు - యేసు యుగానికి చెందిన ఏ యూదుడికైనా మత్తయ తన వారసత్వాము విషయంలో మరియు అతని విశ్వాస విషయంలో దేశద్రోహిలాగా కనిపిస్తాడు. రెండవ విషయం మత్తయ పన్ను వసూలు చేసేవాడు అతను తన జీవనోపాధిని మరియు తన అదృష్టాన్ని వదిలివేసాడు. సువార్తతో చేరుకోలేని మరియు మన ప్రభువు ఉపయోగించలేనిదిగా మనం కొట్టిపడేసేవారిగా ఎవరు లేరని ఇది ఒక శక్తివంతమైన జ్ఞాపిక .

నా ప్రార్థన

సమస్త దేశములకు తండ్రి , యేసు గురించి మరింత తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్న ఈ రోజు మీరు నా మార్గంలో ఉంచిన వ్యక్తులను గుర్తించడంలో నాకు సహాయపడండి. నా రక్షకుడి గురించి ఎప్పుడు, ఎలా మాట్లాడాలో తెలుసుకోవడానికి నాకు జ్ఞానం మరియు అవగాహన ఇవ్వండి. యేసు నామంలో. ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు