ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనం దేవుణ్ణి మన న్యాయాధిపతిగా భావించినప్పుడు, సాధారణంగా తీర్పుకు లోనవడం మరియు శిక్షను అనుభవించడం గురించి ఆలోచిస్తాము. దేవుడు మన న్యాయాధిపతిగా ఉండటం అంటే, ఆయన తన చిత్తం, పరిపాలన మరియు కృప ప్రకారం మనకు తీర్పు తీరుస్తాడని యెషయా మనకు గుర్తుచేస్తున్నాడు. ఆయన మన పక్షాన ఉన్నాడు మరియు మనకు శిక్ష విధించడానికి కాదు, మనల్ని రక్షించడానికి చూస్తున్నాడు (యోహాను 3:16-17). మన సృష్టికర్తగా మరియు రాజుగా ఆయన ఆజ్ఞలు న్యాయబద్ధంగా ఇవ్వబడ్డాయి, అయినప్పటికీ అవి మనల్ని కాపాడటానికి మరియు ఆశీర్వదించడానికి ఇవ్వబడ్డాయి. క్రొత్త నిబంధనలోని ఒక జాతీయతను ఉపయోగించి చెప్పాలంటే, మనం మన న్యాయాధిపతి ఎదుట నిలబడినప్పుడు, మన ప్రేమగల తండ్రిని చూస్తాము, మరియు ఆయన కుడిచేతి వైపున మన కోసం తన ప్రాణాన్ని అర్పించిన మన రక్షకుడు ఉంటాడు (హెబ్రీయులు 1:3). పౌలు మనకు ఎంతో అందంగా చెప్పినట్లుగా: దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను పొంది తిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము. .మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు. (రోమీయులకు 8:14,15,16) మనం భయం వలన విధేయత చూపము, న్యాయాధిపతికి భయపడము, కానీ మనలను రక్షించడానికి మన తండ్రి చేసిన వాటన్నిటి పట్ల ఉన్న ప్రేమపూర్వకమైన కృతజ్ఞత వలనే విధేయత చూపుతాము!

నా ప్రార్థన

పరిశుద్ధుడా, నీతిమంతుడా, నా గమ్యం, నా భవిష్యత్తు, మరియు నా జీవితం నీ చేతుల్లో ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. యేసు అనే వరం వలన నా పట్ల నీకున్న ప్రేమ నాకు తెలుసు. నీ ప్రేమపూర్వకమైన కృప వలన నన్ను రక్షించాలన్న నీ తపన నాకు తెలుసు. నాలో పరిశుద్ధతను కోరుట నీ కుమారుని బలి ద్వారా నెరవేరిందని నాకు తెలుసు. కాబట్టి దేవా, నా జీవితాన్ని, నా ఆత్మను, మరియు నా నిత్య భవిష్యత్తును సంతోషముగా, ఇష్టపూర్వకంగా నీకు అప్పగిస్తున్నాను. నా కొరకు నీవు చేసిన వాటన్నిటికీ వినయపూర్వకమైన కృతజ్ఞతతో నా విధేయతను నీకు సమర్పిస్తున్నాను. యేసు నామంలో నీకు కృతజ్ఞతలు. ఆమేన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు