ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

"మనము ఆయనకు చెందినవారము!" అబ్రాహాము పిల్లలు కాని, యేసునందు విశ్వాసము ద్వారా ఏకైక సత్యవంతుడు మరియు సజీవుడు అయిన దేవుని వద్దకు వచ్చిన మనకు అపొస్తలుడైన పౌలు అదే చెబుతున్నాడు. పౌలు దానిని ఈ విధంగా చెప్పాడు: అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులైయున్నారు. (ఎఫెసీ 2:13). మనం ఇకపై బయటి వ్యక్తులం కాదు, రెండవ తరగతి పౌరులం కాదు లేదా "ఇటీవల వచ్చిన యోహాను(johny)" యేసు శిష్యులం కాదు! యేసు మనకు మరియు దేవునికి మధ్య ఉన్న అన్ని అడ్డంకులను తొలగించినందున మనం దేవుని పూర్తి పిల్లలం (ఎఫెసీయులు 2:14-18). కృప కారణంగా, మనం ఆయనకు చెందినవారం! మనం దేవుని ఇంటిలో భాగమయ్యాము! మన యేసు ఇంటి పునాది అపొస్తలులు మరియు ప్రవక్తలతో రూపొందించబడింది. ఆ ఇంటి మూలరాయి యేసు స్వయంగా. మనం కూడా ఈ పవిత్ర దేవుని ఇంటిలో భాగమే. దేవునికి స్తోత్రం, యేసు కారణంగా, మనం దేవుని ప్రియమైన పిల్లలుగా ఉన్నాము.

నా ప్రార్థన

ఎల్ షద్దాయ్, పర్వతాల దేవుడు మరియు సర్వశక్తిమంతుడైన ప్రభువైన దేవుడు, ఇశ్రాయేలు నిబంధన దేవుడు, యుగయుగాలుగా, నీ స్థిరమైన ప్రేమ నీ ప్రజలను నీ వాగ్దానాలతో, నీ కృపతో మరియు నీ భవిష్యత్తుతో ఆశీర్వదించింది. యేసుపై విశ్వాసం ద్వారా కృపతో నన్ను నీ కుటుంబంలోకి, నీ ప్రజలలోకి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు.* నన్ను నీ ఇంట్లో ఒక ముఖ్యమైన భాగంగా చేసినందుకు ధన్యవాదాలు. నీ లక్ష్యానికి నా ప్రాముఖ్యతను నేను అనుమానించిన సమయాలకు నన్ను క్షమించు మరియు నేను నీకు మరియు నీ ఇంటికి చెందినవాడినని నాలో గ్రహించేలా చేయుము. యేసు నామంలో, నేను నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు