ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

నిన్న మనం ప్రభువైన యేసును హృదయపూర్వకంగా అనుసరించడానికి ప్రతిజ్ఞ చేసాము. దానిని మరచిపోకుండా పాత అలవాట్లలోకి మరియు విధ్వంసక నమూనాలలోకి తిరిగి జారిపోకూడదు. నేడు, రేపు, మరియు ప్రతిరోజూ ఆయనతో ఉండటానికి ఇంటికి వెళ్ళే వరకు సత్య మార్గాన్ని మళ్ళీ ఎంచుకుందాం! మన హృదయాలను యేసుపై ఉంచుకుందాం, ఆయన మాదిరిని అనుసరిస్తాం, ఆయన మాటలను పాటిద్దాం మరియు యేసుక్రీస్తు శిష్యులుగా మారడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన స్వభావానికి అనుగుణంగా ఉండమని పరిశుద్ధాత్మను ఆహ్వానిద్దాం (మత్తయి 7:21; లూకా 11:28; 2 కొరింథీయులు 3:18)

నా ప్రార్థన

నీతిమంతుడైన తండ్రీ, నీ మార్గము మరియు నీ వాక్యము నా జీవమునకు మరియు మార్గదర్శకత్వమునకు మూలము. నేను ఈ రోజు నీ చిత్తమును, నీ సత్యమును, నీ కుమారుని ఎన్నుకొనుచున్నాను. యేసు నాకు సహాయం చేయుము, దయచేసి నీవలె ఉండుటకు ఆనందకరమైన విధేయత మరియు పరివర్తన ద్వారా నాలో సజీవుడవై రమ్ము. నా ప్రభువు మరియు క్రీస్తు నామములో, నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు