ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ఇదంతా దేవునికి చెందినది! మన పరలోకపు తండ్రి స్వభావం యొక్క బహుముఖ మరియు సృజనాత్మక స్వభావం మన విశ్వంలో ఆశ్చర్యపరిచే అందం మరియు వైవిధ్యంలో తెలుస్తుంది. ఇది మన ప్రపంచం కాదు, కానీ మన తండ్రి మనకు ఇచ్చిన అనేక బహుమతులలో ఒకటిగా మనతో పంచుకోవడానికి ఎంచుకున్నాడు. మన సృష్టికర్త ప్రతి సంవత్సరంలో మారుతున్న ఋతువులను మరియు ప్రతి సూర్యాస్తమయం మరియు సూర్యోదయాలలో రంగుల చిత్రవిచిత్రమైన రూపములలో మన రోజులను రూపొందించడానికి ఎంచుకున్నాడు. అందం మరియు వైవిధ్యం పట్ల, సామర్ధ్యం హాజనితత్వం మరియు మార్పు కొరకైన ఆయన ప్రేమను ఇవి గుర్తు చేస్తాయి. దేవుడు మన ముందు ఉంచిన మరియు కలుగజేసిన అన్నిటితో పాటు, ఆయన మనకు, తన మానవ పిల్లలకు కీర్తి మరియు గౌరవంతో పట్టాభిషేకం చేశాడు. మనలో ప్రతి ఒక్కరూ మన భిన్న పోలికలతో ఉండి కూడా అయనలా తయారవుతారు. మనము అతని దైవిక ప్రతిమను మోసేవారము. ప్రతి వ్యక్తి మరియు ప్రజలందరూ అతనికి విలువైనవారు. విశ్వమంతా యెహోవాది, అయినప్పటికీ ఆయన గొప్పతనంలో, మనలో ప్రతి ఒక్కరినీ సన్నిహితంగా తెలుసుకోవటానికి ఎంచుకుంటాడు. ఆహా , నా మిత్రమా,విశ్వమంతా ఊహించలేని దానికంటే కూడా విస్తారమైన ఎక్కువ ప్రేమతో యెహోవా దయ మీద దయతో మనలో ప్రతి ఒక్కరినీ అంతులేని ప్రేమతో ప్రేమిస్తున్నాడు.

Thoughts on Today's Verse...

It all belongs to God! The multifaceted and creative side of our heavenly Father's nature is revealed in the astounding beauty and variety in our universe. This is not our world, but our Father has chosen to share it with us as one of his many gifts to us. Our Creator chose to provide us with the changing seasons in each year and the kaleidoscope of colors in each sunset and sunrise to frame our days. These are reminders of his love for beauty and variety, for predictability and also change. In addition to all that God has made and placed before us, he has crowned us, his human children, with glory and honor. Each of us is made, even with all of our differences, in his likeness. We are bearers of his divine image. Each person and all the peoples are precious to him. All the universe is the Lord's, yet in his greatness, he chooses to know each one of us intimately. Ah, my friend, that is grace upon grace from the Lord who loves each one of us with an undying love as he sustains a universe too vast for us to imagine!

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడైన యెహోవా, విశ్వం నీది. మీ శక్తివంతమైన పదం ద్వారా మీరు దానిని నిలబెట్టుకుంటారు. సమస్త సృష్టి మీ అద్భుతమైన శక్తి మరియు సృజనాత్మక పాండిత్యానికి ధృవీకరిస్తుంది. చాలా గొప్ప దేవుడిగా, మీరు కూడా మీ సన్నిధిలోకి నన్ను స్వాగతించే నా అబ్బా తండ్రి అని నేను విస్మయంతో ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని ఆశీర్వదించడానికి మరియు జీవించడానికి ఇంత అద్భుతమైన ప్రపంచాన్ని అందించడానికి మీ ఘనతను మరియు శక్తిని ఉపయోగించినందుకు ధన్యవాదాలు. యేసు నామంలో నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. ఆమెన్

My Prayer...

Lord God Almighty, the universe is yours. You sustain it by your powerful word. All creation attests to your marvelous power and creative mastery. As the God who is so great, I pray in awe that you are also my abba Father who welcomes me into your presence. Thank you for using your majesty and might to bless us and provide for us such a wonderful world in which to live. In Jesus' name I pray and praise you. Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of ద్వితీయోపదేశకాండము 10:14

మీ అభిప్రాయములు