ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ఇతరులకు తీర్పు తీర్చడం చాలా సులభం. వారి పోరాటాలు, పరిస్థితులు లేదా నిరుత్సాహాలు మనకు తెలియవని మనం గుర్తుంచుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా, మనకు వారి హృదయాలు తెలియవు. మనం తీర్పు తీర్చేటప్పుడు, క్రీస్తు యేసు ఎవరి కోసం చనిపోయాడో ఆ సోదరుడు లేదా సోదరి కంటే మనల్ని మనం ఉన్నతంగా చూపించుకున్నట్లుగా, ఇతరులకు మరియు మనకు మధ్య ఒక అవరోధాన్ని ఏర్పరుచుకుంటాము! మనం జాగ్రత్తగా లేకపోతే, వారి గురించి మనకున్న తీర్పు అభిప్రాయాన్ని ఇతరులకు కబుర్లు చెప్పేటప్పుడు వ్యాప్తి చేయవచ్చు. వారికి తీర్పు తీర్చే స్ఫూర్తితో మాత్రమే చూడాలనే మన మొండితనం వారిని నిరుత్సాహపరిచి, వారు తడబడేలా చేసే అడ్డంకిని సృష్టిస్తుంది. అలాంటి హానికరమైన అలవాటు గురించి యేసు మనల్ని కఠినంగా హెచ్చరిస్తున్నాడు (మత్తయి 18:6-7). మన సహోదర సహోదరీలకు ప్రోత్సాహకరంగా మరియు ఆశీర్వాదంగా ఉండటానికి మన మనస్సును కేంద్రీకరించుకుందాం మరియు ఇతరుల మార్గంలో అడ్డంకిని ఉంచకూడదు.

నా ప్రార్థన

తండ్రీ, ఇతరుల పట్ల మీకున్న విమోచన కృపకు అనుగుణంగా నా వైఖరిని మార్చుమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నా పట్ల మీరు ఓపికగా ఉన్నట్లే, ఇతరుల వైఫల్యాల పట్ల కూడా నేను మరింత ఓపికగా ఉండాలనుకుంటున్నాను. బలహీనంగా మరియు కష్టపడుతున్న వారికి నేను ఎక్కువ ప్రోత్సాహకరంగా లేనందుకు దయచేసి నన్ను క్షమించండి. నేను ఒక ఆశీర్వాదంగా ఉండగల మార్గాలకు నా కళ్ళు తెరవండి. ఇతరులకు అడ్డంకిగా ఉన్నందుకు నన్ను క్షమించండి. వారితో మీ ఆశీర్వాదాలను పంచుకోవడానికి నా హృదయాన్ని తెరవండి. దయచేసి నన్ను మీ కృప మరియు ప్రోత్సాహక సాధనంగా ఉపయోగించుకోండి, మీ విలువైన పిల్లలలో ఒకరికి స్వార్థపూరిత అడ్డంకిగా ఎప్పుడూ ఉండనివ్వకండి . యేసు నామంలో, ఈ కృపలలో నన్నుఎదుగునట్లు నేను అడుగుతున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు