అక్టోబరు 2019 Archives

31. 10 2019 - 2 థెస్సలొనీకయులకు 3:3

అయితే ప్రభువు నమ్మదగినవాడు; ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వమునుండి కాపాడును.

30. 10 2019 - అపోస్తులకార్యాలు 14:21-22

వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత లుస్త్ర కును ఈకొనియకును అంతియొకయకును తిరిగివచ్చి శిష్యుల మనస్సులను దృఢపరచివిశ్వాసమందు నిలుకడగా ఉండ వలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి.

29. 10 2019 - కీర్తనలు 21:13

యెహోవా, నీ బలమునుబట్టి నిన్ను హెచ్చించు కొనుము మేము గానముచేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము.

28. 10 2019 - 1 పేతురు 2:12

అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్‌క్రియలను చూచి, వాటినిబట్టి దర్శనదినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడియుండుడి.

27. 10 2019 - 1 యోహాను 2:17

లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్త మును జరిగించువాడు నిరంతరమును నిలుచును.

26. 10 2019 - కీర్తనలు 93:5

నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు యెహోవా, ఎన్న టెన్నటికి పరిశుద్ధతయే నీ మందిర మునకు అనుకూలము.

25. 10 2019 - 1 యోహాను 3:8

అపవాది(సాతాను) మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి; అపవాది(సాతాను) యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను.

24. 10 2019 - యెషయా 29:15

తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండ లోలో పల వాటిని మరుగుచేయ జూచువారికి శ్రమ. మమ్ము నెవరు చూచెదరు? మా పని యెవరికి తెలి యును? అనుకొని చీకటిలో తమ క్రియలు జరి గించువారికి శ్రమ.

23. 10 2019 - మలాకి 3:7

మీ పితరులనాటనుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి; అయితే మీరు నాతట్టు తిరిగిన యెడల నేను మీతట్టు తిరుగుదునవి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవియ్యగామేము దేని విషయములో తిరుగుదుమని మీరందురు.

22. 10 2019 - కొలొస్సయులకు 2:15

ఆయనతో కూడ మిమ్మును జీవింపచేసెను;ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను.

21. 10 2019 - సామెతలు 20:1

ద్రాక్షారసము వెక్కిరింతల పాలుచేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైనవారందరు జ్ఞానములేనివారు.

20. 10 2019 - 1 యోహాను 2:5-6

ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను; ఆయనయందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగే తానును నడుచుకొన బద్ధుడైయున్నాడు. మనమాయనయందున్నామని దీనివలన తెలిసికొనుచున్నాము.

19. 10 2019 - జెకర్యా 7:9-10

సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చియున్నాడు సత్యము ననుసరించి తీర్పు తీర్చుడి, ఒకరియందొకరు కరుణా వాత్సల్యములు కనుపరచుకొనుడి.విధవరాండ్రను తండ్రిలేనివారిని పరదేశులను దరిద్రులను బాధపెట్టకుడి, మీ హృదయమందు సహోదరులలో ఎవరికిని కీడు చేయదలచకుడి.

18. 10 2019 - 1 తిమోతికి 1:12

పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు,​నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనైయున్నాను.

17. 10 2019 - మార్కు 9:41

మీరు క్రీస్తువారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు, తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

16. 10 2019 - మార్కు 9:23

అందుకు యేసు (నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే యని అతనితో చెప్పెను.

15. 10 2019 - సామెతలు 18:24

బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహి తుడు కలడు.

14. 10 2019 - రోమా 6:11

అటువలె మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తుయేసు నందు సజీవులుగాను మిమ్మును మీరే యెంచుకొనుడి.

13. 10 2019 - కీర్తనలు 10:15

దుష్టుల భుజమును విరుగగొట్టుముచెడ్డవారి దుష్టత్వము ఏమియు కనబడకపోవువరకుదానిని గూర్చి విచారణ చేయుము.

12. 10 2019 - యెహెజ్కేలు 38:23

నేను యెహోవానై యున్నానని అన్యజనులు అనేకులు తెలిసి కొనునట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి యెదుట నన్ను తెలియపరచుకొందును.

11. 10 2019 - కీర్తనలు 96:9

పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారముచేయుడి సర్వభూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి.

10. 10 2019 - హెబ్రీయులకు 12:28-29

ఏలయనగా మన దేవుడు దహించు అగ్నియై యున్నాడు

9. 10 2019 - కీర్తనలు 91:4

ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది.

8. 10 2019 - నిర్గమకాండము 15:13

నీవు విమోచించిన యీ ప్రజలను నీ కృపచేత తోడుకొనిపోతివి నీ బలముచేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి.

7. 10 2019 - నిర్గమకాండము 15:11

యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు

6. 10 2019 - రోమా 5:1-2

కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము.( కొన్ని ప్రాచీనప్రతులలో-కలిగియున్నాము అని పాఠాంతరము).మరియు ఆయన ద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగల వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయ పడుచున్నాము.

5. 10 2019 - 1 సమూయేలు 12:15

అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసినయెడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా నుండినట్లు మీకును విరోధముగా నుండును.

4. 10 2019 - 1 కొరింథీయులకు 6:11

మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని, ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చ బడితిరి.

3. 10 2019 - సామెతలు 19:15

సోమరితనము గాఢనిద్రలో పడవేయును సోమరివాడు పస్తు పడియుండును.

2. 10 2019 - కీర్తనలు 5:11

నిన్ను ఆశ్రయించువారందరు సంతోషించుదురునీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు

1. 10 2019 - కొలొస్సయులకు 1:13

ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను.