ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

యేసు బాప్తిస్మం తీసుకున్న కొద్దికాలానికే, 40 రోజులు శ్రమలలో సాతానును ఎదుర్కోడానికి వెళ్ళాడు. సాతాను ప్రారంభ మాటలు ఏమిటో గుర్తుందా? "నీవు దేవుని కుమారుడైతే ..." ప్రశ్నించబడటానికి ముందే దేవునితో తన సంబంధాన్ని తెలుపుట గొప్ప విషయం కాదా? మిమ్మిను ఇష్టపడే వారు ఈ రోజు మీ నుండి ఏమి వినాలి? వారి శ్రమల సమయం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు; కానీ అది తప్పక వస్తుందని మీకు తెలుస్తుంది, కాబట్టి ముందుకు సాగండి మరియు అవసరమైన సమయంలో వారికి నమ్మకాన్ని కల్పించండి!.

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడైన మరియు ప్రేమగల తండ్రీ, దయచేసి నేను ప్రేమించేవారికి ప్రేమ మరియు ఆప్యాయత యొక్క సరైన మాటలు చెప్పడానికి , తద్వారా శోధనలు వచ్చినప్పుడు, లేదా ఇతరులు నన్ను నా నుండి దూరం చేయడానికి ప్రయత్నించినప్పుడు, వారు వారి పట్ల నాకున్న ప్రేమను అనుమానించకుండునట్లు నాకు సహాయం చెయ్యండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు