ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

పదాలు శక్తివంతమైనవి. విషయాలను ఎక్కువగా మాటాడేవారికి ఇది తెలుసు. సంధానకర్తలకు ఇది తెలుసు. ఇది మీకు లోతుగా తెలుసు. పదాలు మిమ్మల్ని ఆశీర్వదించాయి మరియు పదాలు మిమ్మల్ని నాశనమును చేయగలవు . దయ మరియు సున్నితమైన పదం నుండి వచ్చే వైద్యం విలువైనది. క్రూరమైన వెక్కిరింపు లేదా బాగా చెప్పబడిన మోసము , నాశనం చేయడము అణిచివేస్తుంది. అటువంటి గొప్ప మాటల శక్తిని కలిగి ఉండటం అద్భుతమైనది. మన ప్రసంగంలో కనిపించే ఈ అద్భుతమైన శక్తిని ఉపయోగించడం ఒక అద్భుతమైన బాధ్యత. యేసును గౌరవించటానికి ప్రేమతో అటువంటి మాటలను అర్పించినప్పుడు జీవితాన్ని, నిరీక్షణను మరియు శాంతిని ఇచ్చే శక్తిని ఆ పదాలు కలిగి ఉంటాయి. ఈరోజు అటువంటి మాట మాట్లాడుకుందాం!

నా ప్రార్థన

ఓ తండ్రీ, ఈరోజు నా మాటలు ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను. అవి మీ దయను ప్రతిబింబించాలని కోరుకుంటున్నాను. అవి బాధపడేవారికి స్వస్థత మరియు దుఃఖంలో ఉన్నవారికి ఓదార్పునివ్వాలని నేను కోరుకుంటున్నాను. అవి విరిగిన హృదయము కలిగినవారితో మృదువుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. క్లిష్ట పరిస్థితుల్లో అవి గౌరవప్రదంగా మరియు నిజాయితీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా చుట్టూ ఉన్న భాష అసంపూర్ణమైన జ్ఞానముతో పచ్చిగా ఉన్నప్పుడు అవి నిటారుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీ ఆత్మ ద్వారా, ఇతరులను ఆశీర్వదించడానికి మరియు మీకు మహిమను తీసుకురావడానికి నా ప్రసంగాన్ని ఉపయోగించండి. మీ అంతిమ వాక్యమైన యేసు నామంలో, నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు