ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

యేసును మన ప్రభువుగా కలిగి ఉండడమంటే, ఈ కీలకమైన శాశ్వతమైన వాస్తవికతతో మనం ఇతరులపై బలవంతముగా ఒత్తిడి తేడము కాదు. సౌమ్యత మరియు గౌరవం యేసును తమ ప్రభువుగా కలిగి ఉన్నవారి యొక్క గుణాలక్షణాలు అయివుంటాయి . అన్నింటికంటే, యేసు ఇతరుల కోసం చనిపోయేంతగా ప్రేమించాడు. తాను చనిపోయినప్పుడు తనను సిలువ వేసి అపహాస్యం చేసిన వారిని క్షమించమని యేసు అడిగాడు. అటువంటి ప్రభువును కలిగియుండుట అంటే, ఆయనలో మన నిరీక్షణకు ఆధారాన్ని పంచుకోవడానికి మనకు అవకాశం లభించినప్పుడు మనం ప్రతిస్పందనను సిద్ధం చేసుకున్నామని అర్థం. మన చుట్టూ ఉన్నవారికి ఆసక్తి కనిపించకపోవచ్చు, కానీ చాలామంది వారు ఇంకా గుర్తించని వాటిని కోరుకుంటారు. యేసును కలవడానికి వారి సమయం సరైనది అయినప్పుడు సిద్ధంగా ఉందాం!

నా ప్రార్థన

పవిత్రుడు మరియు దయగల దేవా, నా చుట్టూ ఉన్న వారితో యేసు ప్రేమను పంచుకునే అవకాశాలను చూసే జ్ఞానాన్ని దయచేసి నాకు ఇవ్వండి. నేను ఇప్పుడు పేరుపేరునా ప్రస్తావించిన నా అనేకమంది మిత్రులతో యేసును పంచుకోవడంలో నాకు సహాయం చేయవలసిందిగా నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అడుగుతున్నాను... తండ్రీ, దయచేసి విమోచనాత్మకంగా దీన్ని చేయడానికి నాకు మృదుత్వాన్ని ప్రసాదించండి, యేసు తాను ఎవరి పట్ల ఆ గౌరవాన్ని చూపించాడో అదే గౌరవాన్ని వారికి చూపండి.ఆయన వారికి పరిచారకుడు అయ్యాడు. రక్షకుడైన నీ కుమారుడైన యేసు నామంలో నేను వారికి ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు