ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

కొన్నిసార్లు వెంటనే సమాధానాలు ఉండవు. మనము ప్రార్థించాము, ఏడ్చాము, ప్రయత్నించాము, నిద్రలేకుండా పోయాము మరియు దుఃఖించాము మరియు అరిచాము. ఇంకను మనము సమాధానాలు కనుగొనలేము. వేదనతో కూడిన కవాతులో రోజులు గడుస్తున్నాయి. అయినప్పటికీ, మనం దేవుని స్వరాన్ని గుర్తించలేము. మనము ఏమి చేద్దాము? మనము కీర్తనలకు వెళ్తాము. మనము మన హృదయాలను వేదనతో కూడిన కేకలు వేయడానికి ఆ కీర్తనలను అనుమతిస్తాము. మనము సమస్త విశ్వం యొక్క దేవునితో నిజాయితీగా ఉన్నాము మరియు అతని నుండి దయ కోసం ఎదురుచూస్తాము. మన అత్యంత సవాలుగా ఉన్న సమస్యలలో కూడా, అతను మన మాట వినడమే కాకుండా, మన జీవితంలో ఏమి జరుగుతుందో దానికి కూడా అతను శ్రద్ధ వహిస్తాడని నమ్ముతాము.

నా ప్రార్థన

సర్వశక్తి మంతుడవైన దేవుడా, వ్యాధులను స్వస్థపరచు ఏకైక నిజమైన వైద్యుడా మరియు విరిగిన హృదయాలను బాగుచేయువాడా , నేను ప్రేమించేవారిలో ఎవరైతే ఇటువంటి నిరాశకరమైనా పరిస్థితులలో ఉన్నారో వారి రోదనను ఈ రోజున వినండి. వారిలో ప్రతిఒక్కరి జీవితములో మీ దయ, కృప మరియు నీ ప్రత్యక్షపు అనుభూతితో మీ చిత్తము జరుగును గాక . మరియు ప్రభువా , దయచేసి నా సమీపంలో ఉండండి, మరియు నా ప్రార్ధనలకు నీ సమాధానమును చూచునట్లుగా నాకు సహాయము చేయండి . సదా నీవానిగ క్రీస్తు నామములో అడుగుచున్నాను .ఆమెన్ .

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు