ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ప్రతీకారం అనునది నిరపరాధిని,మరియు అపరాధిని ఇద్దరినీ కూడా నాశనం చేయు సాతాను యొక్క విధానం . ఒకసారి ప్రతీకారంతో ప్రేరేపించబడితే ఆ దెబ్బతిన్న వ్యక్తి హఠాత్తుగా కోపం మరియు ద్వేషంతో తుడిచిపెట్టుకొనిపోతాడు . ఈ విషం ప్రతీకారముకలిగిన వ్యక్తి తాకిన ప్రతిదానికీ వ్యాపిస్తుంది. ఆ సమయంలో న్యాయ వ్యవస్థలో "మంచితనము" ఎంతవున్నప్పటికీ, భూమిపై ఎక్కడ సంపూర్ణ మరియు పూర్తి న్యాయాన్ని కనుగొనలేకపోవటాన్ని మనం చూడవచ్చు, కానీ దేవుడు న్యాయాన్ని మాత్రమే తీసుకురాడు. ఆయన మనల్ని విడిపిస్తాడు,దౌర్జన్యకారుల చేతిలోనుండి ,ద్వేషం యొక్క విషం నుండి నుండి మనకు విడుదల కలిగిస్తాడు.

నా ప్రార్థన

క్షమిస్తున్న ప్రభువా!, సమస్త న్యాయానికి, నిబ్బరమైన ప్రేమకు దేవుడవైన దేవా!నా దేశపు న్యాయవ్యవస్థలో మీరు కార్యము చేయాలనీ నేను కోరుకొనుచున్నాను. న్యాయవ్యవస్థను మరింత నిస్పక్షపాతంగా, నిజాయతీగా ఉండేలా చేయండి .న్యాయాన్ని అమ్ముతూ కొనుగోలు చేసేవారిని అధికారం నుంచి తొలగించండి. హింసాత్మకంగా మరియు అణచివేతకు కారకులైన వారిపట్ల మీ చేతితో వ్యవహరించండి . ప్రభువా! దయచేసి , నీ ఆత్మ శక్తితో నన్ను కదిలించి ఇతరులను క్షమించుటకును, నీ న్యాయమును గూర్చి వేచి చూచునట్లుగా చేయండి. క్షమాగుణం లేని విషపు మరియు ప్రతీకారంతో నిండిన హృదయాలనుండి నన్ను కాయండి. నన్ను తప్పుగా అనుకునే వారిపట్ల నా దృక్పథం, ప్రవర్తన మరియు ప్రతిస్పందన మీ కుమారుడు తమ రక్షకుడని తెలుసుకోవడానికి సహాయపడును గాక . యేసు నామమున నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు