ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ఓ పాత శక్తివంతమైన క్రైస్తవ కీర్తన లో "యేసు యొక్క శిలువ క్రింద నా సమస్త కీర్తి" అని మేము పాడుతుంటాము.వాస్తవముగా యేసుని గూర్చి ఆ కీర్తన నిజం. ఇతర మానవ సంబంధమైన నాయకులు అనేక భిన్నమైన మార్గములలో మహిమను వెతుకుతుంటే, మహిమకొరకు యేసుని మార్గం మాత్రం సిలువయివుంది.ఎందుకంటె ఆయన ప్రశంసల వెంబడి పరుగెత్తలేదు కానీ తండ్రికి లోబడి ఆయనను మహిమ పరిచేను. యూదా ఆ చివరి ప్రభు రాత్రి భోజనమును విడిచివెళ్లిన తరువాత యేసుని ఆ భయానకమైన సిలువ వద్దకు తీసుకొనివచ్చు ఆ చివరి ఘట్టము ప్రారంభించబడింది. సిలువను తన యొక్క హీనదశగా చూచుటకు బదులు అయన దేవుని మహిమ పరచుటకు దానిని మార్గముగా చూసేను.

నా ప్రార్థన

ప్రియమైన ప్రభువా! ఇతరుల అంగీకారం మరియు గుర్తింపు కొరకు వెతికినందుకు నన్ను క్షమించండి. స్వార్ధ చింతన కలిగినవాడననైనందుకు నన్ను క్షమించండి.మీ మహిమను కాక నా మహిమను గూర్చి ఆలోచించినందుకు నన్ను క్షమించండి.నేను నా గురించిన ఆసక్తిలో నిమగ్నమై ఇతరుల హృదయాలను త్రొక్కివేసినప్పుడు నన్ను క్షమించండి. ఎంత మూల్యం అయినప్పటికీ నిన్ను సేవించుటలోనే గొప్పతనం అనేది కనుగొనబడుతుంది అని గ్రహించే విధముగా యేసుని జీవితకాలంలోని చివరి వారపు మాదిరి నాకెంతగానో సహకరించెను. యేసు నామమున ప్రార్ధిస్తున్నాను ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు