ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

పండుగకు సిద్దపడుచున్న ఈ కీలకమైన కాలంలో యేసును ఎక్కడ కనుగొనవచ్చునో యూదాకు తెలుసు. తోటలో యేసు తన శిష్యులతో కలిసి ప్రార్ధన చేస్తాడనేది రహస్యమేమీ కాదు. అలా ద్రోహం చేయాలని మనలను అప్పగించాలని కోరుకునే వ్యక్తి మనకూ ఉంటే, ఆ వ్యక్తి మనల్ని ఎక్కడ కనుగొనవచ్చునని మన శత్రువులకు చెప్తాడు ? మనము ఎక్కడ ప్రార్ధనలో ఉంటామో వారికి తెలుసా? ఇవి ఆసక్తికరమైన ప్రశ్నలు కావా! ప్రార్థన చేసే స్థలములో మనల్ని కనుగొనవచ్చునని మన శత్రువులు తెలుసుకోవడముకంటె మించిన మెప్పును ఊహించగలమా?

నా ప్రార్థన

అమూల్యమైన ప్రార్థన సమయంలో మీతో కూడా మరింత విశ్వాసముగా చేరనందుకు తండ్రి నన్ను క్షమించు . నేను నా ప్రార్థన సమయములలో తీరికలేనివాడనిగా, పరధ్యానంలో మరియు నిస్సంకోచంగా ఉన్నానని ఒప్పుకుంటాను. నన్ను క్షమించండి. నేను ఒక క్రమశిక్షణగా ఈ ఆశీర్వాదాన్ని ఎందుకు చేరుకోవాల్సి ఉంటుందో నాకు తెలీదు, కానీ ప్రార్థన యొక్క ఈ కృపకు ఆనందముగా నన్ను పిలిచేటట్లుగా మీ ఆత్మ చేత నా హృదయంలో అగ్నిని పుట్టించమని నేను ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యక్షత మరియు నన్ను గూర్చిన చింత మీకుండాలని నిజంగా నా స్థిరమైన నిరీక్షనైవుంది. యేసు నామమున నేను ప్రార్దిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు