ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

"క్రొత్తది మరియు మెరుగైనది" అనేది ప్రజల ఆదరణ మరియు గుర్తింపు కోల్పోయి పడిపోయిన పాత ఉత్పత్తులను తిరిగి పరిచయం చేయడానికి మార్కెట్ వారు ప్రధానము గా ఉత్పత్తులకు తగిలించే చిట్టి .కొన్ని మార్పులు చేయడం పాత ఉత్పత్తులను మరల మార్కెట్లోనికి తేవడం. క్రీస్తు "నూతన పరచవలసిన మరియు మెరుగు పరచవలసిన" అవసరం లేనివాడిని కొలస్సియులు తెలుసుకోవాలని పౌలు కోరుకున్నాడు.బదులుగా, వారు మొదట క్రైస్తవులుగా మారినప్పుడు వారు చేసినట్లుగానే ఆయనను ప్రభువుగా వెంబడించాలని కోరుకున్నాడు.మనము కూడా అదే అవసరమును కలిగియుండవలెను . తన కుమారుని లో దేవుని యొక్క అద్భుతమైన బహుమతికి కృతజ్ఞతతో నిండినవారైఉండి ప్రభువునిగా క్రీస్తు యేసులో మన జీవితాలు పోషించబడేలా వేరుపరాలి.

నా ప్రార్థన

ప్రేమల మరియు సర్వశక్తిమంతుడవైన దేవా ,యేసు క్రీస్తులో నాకు ఇవ్వబడిన మీ కృపాబహుమానమును బట్టి నీకు కృతజ్ఞతలు.నూతనమైన వాటిని బట్టి ఊరకయే భ్రమపెట్టబడినప్పుడు లేదా అటుఇటు తిరుగు నా కోరికలు నన్ను తాకి నాకేదో అపూర్వమైనవి కావాలనిపించినప్పుడు నన్ను క్షమించండి.యేసు తో ప్రతిరోజు నా ప్రయాణమును నూతనపరచండి.నా జీవితము మార్గమంతటిలో కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆయన న్యాయకత్వం నాకు సహాయము చేస్తుందని ఆయన పట్ల నాకున్న ప్రశంసను మరియు సంతోషముతో ,బలముతో,నిరీక్షణతో మరియు శక్తితో ప్రతీరోజు ఇప్పుడున్న నూతన ఉత్తేజకరమైన అవకాశాలను బట్టి ఆయనను కొనియాడుటను బలపరుచుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాను ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు