ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మతపరముగా భిన్నమైన ఆలోచనలు కలిగిన ప్రపంచంలో, వారి చుట్టూ మెరిసే మతాలు మంచి శబ్దం మరియు వారికి కావలసిన జీవనశైలికి సరిపోయేవిగా ఉండి ఉండగా , ఈ మతాలు యేసు లో దేవుడు మనకు అందించే వాటి యొక్క ఛాయ మాత్రమే అని పౌలు కొలస్సియులైన క్రైస్తవులకు గుర్తుచేస్తున్నాడు . యేసులో, మనకు నిజ స్వరూపము అనగా ఆధ్యాత్మిక నిజ స్వరూపము మరియు భౌతిక నిజ స్వరూపము కలదు.యేసులో మనము ఒక్కటిగా ఉండునట్లు దేవుడు యేసునందు మనలో ఒకడిగా అయ్యాడు కనుక మనము ఆయనతో కలిసి ఉండగలము. యేసులో మనకు లభించునదే నిజమైవున్నది.

నా ప్రార్థన

ఓ ప్రభువా, నా పూర్ణ హృదయముతో మీ కుమారుని అనుసరించునట్లు నాకు దృష్టిని ఇవ్వండి. బయట అనేకమైన ఇతర మతపరమైన ఆలోచనలు ఉన్నవని నాకు తెలుసు, కానీ నా పాపము కొరకు మరణిస్తూ, మరణం నుండి నన్ను కాపాడటం ద్వారా మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో యేసు మాత్రమే కనపరిచారు అని నాకు తెలుసు.ఆయన యందు నమ్మిక ఉంచుట మాత్రమే కాక ఆయనను అనుసరించాలనుకొనుచున్నాను.నా స్వభావము ఆయన స్వభావమునకు మారిపోవాలనుకొనుచున్నాను.నిజమైన రక్షకుడైన యేసుక్రీస్తునామమున ప్రార్ధించుచున్నాను.ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు