ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దేవుని చిత్తమైతే మీరు స్వల్ప కాలిక ప్రణాళికలు చేస్తారా లేదా దీర్ఘకాలిక ప్రణాళికలు చేస్తారా? నేను ప్రణాళికలు చేస్తాను.కానీ నా ప్రణాళికలు, "ప్రభువా వీలైతే, మీ చిత్తము మీ కాలము "అనే ఒక కనిపించని ప్రత్యేక నక్షత్ర చిహ్నాన్ని( ఆస్ట్రిక్*) కలిగివుంటాయి.మీ గురించి నాకు తెలీదు ,కానీ దేవుడు నాకు ఆయన సమయాన్ని చూపించాడు మరల ,అది కూడా నేను ఆయనకు నన్ను నేను బహిర్గతం చేసుకుంటేనే ,ఆయన సమయము అనేది నా ప్రణాళికకంటే కూడా మేలైనది, దీని అర్ధం నేను ప్రణాళికలు చేయను అని కాదు.చేస్తాను కానీ ప్రార్ధన తోను, అలాగే దేవుని సంకల్పము తెలుసుకొనుచు దానిని చేయునట్లు దేవుని యొక్క జ్ఞానమును మరియు పరిశుద్ధాత్మను అడుగుచు ప్రణాళికను చేస్తాను.(యాకోబు 1:5-6, ఎఫెసీయులు 5:15-18) ప్రార్ధనతోను మరియు పరిశుద్దాత్మ నడిపింపు లేకుండా ఉండడానికి జీవితమనేది చాలా చిన్నది.

నా ప్రార్థన

తండ్రి ,ఈ రోజు మరియు నా బ్రతుకు దినములన్నియు, నా చిత్తము కాదు కానీ మీ చిత్తము జరుగునుగాక , యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను ఆమేన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు