ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ప్రభువు సమీపముగా వున్నాడు కాబట్టీ మనము ఆనందిస్తూ ప్రతివారియెడల మర్యాదగా నడుచుకొందాము.తన ఆత్మ ద్వారా ఆయన మనయందు నివసిస్తున్నాడు కాబట్టి ఆయన సమీపముగా ఉన్నాడు. ఆయన త్వరగా రానున్నాడు కాబట్టి అయన సమీపముగా ఉన్నాడు. మనము ఇతర విశ్వాసులతో కలిసియున్నప్పుడు ,అక్కర లో వున్నవారిని ఆదరించినప్పుడు,ఇతర సంస్కృతి సాంప్రదాయాలకు చెందిన మన స్నేహితులు మరియు ప్రజలకు సువార్త పంచినపుడు మనతో ఉంటానని వాగ్దానము చేసియున్నాడు కాబట్టి ఆయన సమీపముగా ఉన్నాడు.సంతోషకరమైన మరియు దయగల వ్యక్తిగా ఉండుట కంటే ఇతరులకు అందించగలిగేది ఏదీ లేదు.యేసు మనలో నివసిస్తున్నాడు, మన ద్వారా పనిచేస్తున్నాడు , మరియు మనకోసం వస్తున్నాడు, మనము ఆనందంతో మరియు సున్నితమైన వారిగా ఉండవచ్చు!

నా ప్రార్థన

తండ్రి,నేను ఎన్నటికి ఒంటరిని కాదు అని తెలిసి నేను పులకరించిపోయాను.నా పాపముల కొరకు మరణించునట్లు యేసును నా కొరకు పంపినందుకు నీకు కృతజ్ఞతలు.నేను ఇతర విశ్వాసులతో కలసియున్నపుడు, యేసు నామమున ఇతరులకు సేవచేసినప్పుడు, మరియు ఇతరులకు సువార్తను పంచినప్పుడు యేసు మాతో కూడా వుంటున్నందుకు కృతజ్ఞతలు. ఆయన ప్రత్యక్షతను బట్టి నాలో కలుగు ఆనందము నేను ఇతరులకు చేసే సేవ మరియు నా జీవన విధానములో కనిపించునుగాక.యేసు వెలగల నామమున ప్రార్ధించుచున్నాను ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు