ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
మనకు మరణంపై విజయం, సంపూర్ణ విజయం ఉంది. జీవితంలోని అతిపెద్ద పరీక్ష అయిన మరణానికి మన దగ్గర సమాధానం లేకపోతే, మనకు ఎప్పటికీ శాశ్వతమైన విజయం ఉండదు. సూపర్ బౌల్ మరియు వరల్డ్ సిరీస్ ప్రతి సంవత్సరం ఆడతారు. ఒక ఛాంపియన్ కేవలం ఒక సంవత్సరానికి మాత్రమే విజేతగా ఉంటాడు మరియు పదేపదే పోటీపడి, సీజన్‌ను విజయవంతంగా ముగించడం ద్వారా దానిని సంపాదించుకోవాలి. కానీ ఒక క్రైస్తవుడు శాశ్వతంగా ఛాంపియన్‌గా ఉంటాడు. యేసు కారణంగా, క్రీస్తు యేసు యొక్క ప్రతి నిజమైన శిష్యునికి మరణంపై శాశ్వతమైన విజయం ఉంది. అవును, "దేవునికి స్తోత్రం! ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు."
నా ప్రార్థన
యేసు క్రీస్తునందు శాశ్వతమైన విజయముతో మమ్మల్ని ఆశీర్వదించినందుకు దేవా, నీకు వందనాలు. ఆయన మమ్మును మృతులలో నుండి లేపి నీ యొద్దకు చేర్చినప్పుడు ఎలాగైతే నీ చిత్తము మాలో జయముగా ప్రత్యక్షమవుతుందో, అలాగే ఇప్పుడు కూడా పాపముతో మేము చేసే దైనందిన పోరాటాలలో నీ చిత్తమును మాలో జయముగా ప్రత్యక్షపరచుము. మా జయశీలుడైన రాజు ద్వారా మేము నీకు మా స్తుతిని అర్పిస్తున్నాము. ఆమేన్.


