ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మన "మాట" ఎంత ప్రాముఖ్యమైనదో నిన్న యాకోబు గుర్తుచేశాడు.నేడు ఆయన మన నడతను గురించి జ్ఞాపకం చేయుచున్నాడు.నిజమైన మతం అనగా కేవలం మాటలే కాదు మనము క్రీస్తు వలే జీవించాలి, మరియు ప్రేమించాలి.మనము మన దేవునికి పరిశుద్ధముగా జీవించుకుంటూ విధవరాండ్రను, అనాథలను, జనమందరిచే మరువబడినవారిని , నిర్లక్ష్యం చేయబడినవారిని ఆదరించుటయే నిజమైన క్రైస్తవజీవమును జీవించుట. ద్వితీయోపదేశకాండము 15:1-18). యేసు అనుచరులుగా, మనల్ని మనం దేవునికి పవిత్రంగా ఉంచుకుంటూ ఇతరులపట్ల శ్రద్ధ వహించాలి. "క్రీస్తువలె " అంటే ఇదేనని మనం తెలుసుకోవాలని యేసు సోదరుడు యాకోబు కోరుకుంటున్నాడు!

నా ప్రార్థన

ప్రేమగల తండ్రి, మీ దీవెనలు అవసరమైన జనమును చూచునట్లు నాకు కన్నులను ఇవ్వండి.మరువబడినాము, నిర్లక్ష్యం చేయబడినాము అని అనుకునే సంఘము ,మా ఇరుగుపొరుగు మేము పనిచేయుచోట ,పాఠశాలలోని జనము యొద్దకు చేరునట్లు నన్ను నడిపించండి. వారిని చూచుటకే కాక వారికొరకై మీరు కలిగియున్న ప్రేమలోవారిని కూడా చేర్చునట్లు నాకు సహాయము చేయండి.యేసు నామమున ప్రార్థిస్తున్నాము ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు