ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దేవుడు మనల్ని ఖండించడానికి ఏదో ఒక కారణం కోసం వెతుకుతున్న ప్రతీకారపూరిత దేవుడునిగా కాకుండా, అన్ని జాతులు మరియు భాషల ప్రజలందరూ తనను తెలుసుకోవాలని, పశ్చాత్తాపంతో అతని వైపు తిరగాలని మరియు తన కుమారుడిని ప్రభువు మరియు రక్షకునిగా అనుసరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే యేసు వచ్చాడు (యోహాను 3:16-27). అందుకే యేసు తిరిగి రావడం ఇంకా జరగలేదు. కాబట్టి మన కోరిక యెహోవా చిత్తాన్ని నెరవేర్చి, మనం చేసే ప్రతి పనిలో ఆయనను సంతోషపెట్టాలంటే, యేసు గురించిన సాధారణ సత్యాన్ని ప్రపంచ ప్రజలందరికీ తీసుకురావడానికి మనం ఏదైనా చేయాలవద్దా ? ఇదే యేసు మనకు ఇచ్చిన మిషన్ (మత్తయి 28:18-20; అపొస్తలుల కార్యములు 1:8). ఆయన కృపను తెలుసుకుని, పశ్చాత్తాపపడి యేసును ప్రభువుగా అనుసరించమని వారిని పిలవడానికి మనం చేయగలిగినదంతా చేయాలవలెనుగా?

నా ప్రార్థన

నీతిమంతుడవైన జీవం గల తండ్రి,నీ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకొనటానికి ప్రయత్నం చేయుచుండగా నాకు సహాయం చేయండి. దయచేసి ఇతరులతో సువార్తను పంచుకోవడానికి ఎప్పుడు మరియు ఎలా నా అనువయిన ప్రదేశం నుండి వెలుపలకు రావచ్చునో తెలుసుకోవడానికి నాకు ధైర్యం, జ్ఞానం మరియు సమయమును ఇవ్వండి. తప్పిపోయినవారిని మారుమనస్సుకు నడిపించటానికి మరియు యేసును ప్రభువుగా అనుసరించటానికి వారికీ సహాయపడటానికి చేస్తున్న అన్ని ప్రయత్నాలను దయచేసి దీవించండి. యేసు నామములో ప్రార్ధించుచున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు