ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మన దేవుడు ఒక అద్భుతమైన దేవుడు. అతను పాపాన్ని గూర్చి తెలియజేస్తాడు మరియు పాపాన్ని ఓడిస్తాడు; మన పాపాలను క్షమించి, మనల్ని పరిశుభ్రపరచడం ద్వారా పాప పరిణామాల నుండి ఆయన మనకు విడుదల కలిగిస్తాడు.నిజమైన స్వస్థత అనగా ఒక రోగపూరితమైన దేహాన్నీ బాగుచేయుటకంటే మించినది - ఆవిధముగా మన జీవితములో అనేక మార్లు చేసిన దేవుని మేము ఘనపరుచుదుము.కానీ నిజమైన స్వస్థత అనగా క్షమించుట మరియు మన ఆత్మలను విచ్ఛిన్నం చేసిన, ఆత్మలు మరియు శరీరాలకు అనారోగ్యం కలుగజేయువాటినుండి మనకు విడుదల కలిగించుట.

నా ప్రార్థన

అబ్బా తండ్రీ,నన్ను క్షమించి, విముక్తి కలిగించి ,మరియు నా పాపంనుండి నన్ను శుభ్రపరచినందుకు నీ కృపను మరియు దయను చాలినంతగా ఎలా నేను ఘనపరచగలను . క్షమించబడి మీ కుటుంబములో చేర్చబడుట యొక్క ఆనందాన్ని ఎన్నటికీ మరచిపోకుండునట్లు నాకు సహాయం చేయండి. రక్షణకై మీకు కృతజ్ఞతలు . యేసు నామములో నేను నిన్ను స్తుతించుచున్నాను . ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు