ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

అవకాశం వచ్చినప్పుడు, మనం దయతో కూడిన పనులు చేయడానికి మరియు మాటలు మాట్లాడటానికి ఎంచుకుంటాము, ఎందుకంటే యేసు మనలను దానికోసమే పిలిచారు. లోకంలోని నిరాశకు, క్షీణతకు రుచిని, సంరక్షణను చేకూర్చే ఉప్పుగా ఉండమని ఆయన మనలను సవాలు చేశారు (మత్తయి 5:13). లోకంలోని చీకటిని వెళ్లగొట్టే వెలుగుగా ఉండమని ఆయన మనలను పిలిచారు (మత్తయి 5:14-16). ఇతరుల పట్ల దయతో మరియు ప్రయోజనకరంగా ఉండే పద్ధతులలో, ముఖ్యంగా మన మాటల ద్వారా ప్రవర్తించడానికి మేము కట్టుబడి ఉన్నాము. దయగా మరియు ప్రోత్సాహకరంగా ఉండే అవకాశాల కోసం మేము ప్రార్థిస్తాము, ఎందుకంటే మేము చెప్పే మాటలు ఇతరులకు ప్రయోజనం చేకూర్చాలని మేము కోరుకుంటున్నాము (ఎఫెసీయులు 4:29). ఈ మాటల ద్వారా వ్యక్తమయ్యే దయ, పరిశుద్ధాత్మ సన్నిధికి సూచన (గలతీయులు 5:22-23), ఎందుకంటే ఆత్మ మనలను మన రక్షకుని దయకు మరియు స్వభావానికి అనుగుణంగా మారుస్తుంది (2 కొరింథీయులు 3:18). ఈ విధమైన మర్యాదపూర్వకమైన మాటలు — తరచుగా అసభ్యకరమైన, మోటుగా మరియు కఠినంగా చెప్పబడే మాటలు కాదు — ఇతరులతో సౌమ్యతతో, గౌరవంతో ప్రవర్తించడానికి చేసే ఒక ఉద్దేశపూర్వక ప్రయత్నం. ఎందుకంటే యేసునందు మనకున్న నిరీక్షణను వారు తెలుసుకోవాలని మనం కోరుకుంటాము (1 పేతురు 3:15-16). ఇతరులను ఆశీర్వదించి, వారిని యేసు వద్దకు నడిపించే మంచి మాటలు చెప్పడానికి లభించే ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం!

నా ప్రార్థన

తండ్రీ, ఈ వారం నేను మాట్లాడిన అజాగ్రత్త మాటలకు నన్ను క్షమించు. ఈ అజాగ్రత్త పదాలు రెండు సార్లు పాపమూ చేసినంత అని నేను అర్థం చేసుకున్నాను అది ఎలా అనగా - నేను ఒకసారి నేను ఆ అజాగ్రత్త మాటలు మాట్లాడుట వలన చేసిన పాపం మరియు అది రెండవసారి పాపం ఎందుకంటే ఆ మాటలనుండి విమోచన పొంది సహాయం చేసే అవకాశం కొరకు నేను చూడలేదుగనుక . ఆశీర్వదించడానికి నా మార్గంలో మీరు ఉంచిన వారిని నేను చూసేలా నా కళ్ళు తెరవండి ప్రభూ. యేసు యొక్క ఆశీర్వాద నామం ద్వారా నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు