ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మన వాక్కు ఎంత గొప్పది?మన హృదయాల్లో ఏమి జరుగుతుందో మన మాటలు బయలుపరుస్తాయని యేసు చెప్పాడు . మన మాటలు గాయపర్చవచ్చు లేదా నయం చేయగలవని సామెతలు పదేపదే చెబుతుంటుంది.వినువారికి ప్రయోజనం చేకూరునట్లు మాట్లాడమని అపొస్తలుడైన పౌలు మనకు చెబుతున్నాడు.ఈ లేఖనాల వెలుగులో దావీదు చేసిన ఈ ప్రార్థన ఎంతో సముచితమైనది.మన నాలుకను నియంత్రించుకొని ఇతరులను దీవించడానికి ఉపయోగపడేవిధముగా దేవుడు మాత్రమే సహాయం చేయగలడు. మన హృదయాలను తన ఆధీనములోనికి తీసుకొనినట్లు మన మాటలను కూడా తన ఆధీనములోనికి తీసుకోనువిధముగా ఆయనను మన మాటల ప్రపంచములోనికి ఆహ్వానించుదాము రండి.

నా ప్రార్థన

అత్యంత పవిత్రమైన మరియు నీతిమంతుడవైన తండ్రి, నేను నా మాట చేత నిన్ను అప్పగించే వానిగా మరియు మీ పిల్లలను గాయపరచువానిగా ఉండకూడదని అనుకొనుచున్నాను. దయచేసి నా మాట విమోచించి, మీ పిల్లలను ఆశీర్వదించి,మీ కుమారుని గూర్చి తెలియని వారికి రక్షణ గురించి మాట్లాడడానికి సహాయంచేయండి.యేసు నామమున నేను ప్రార్థన చేస్తున్నాను.ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు