ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ప్రతి యుగంలోను క్రైస్తవులు బలహీనుల యొక్క హక్కులను పరిరక్షించడానికి, నిరాకరించబడినవారి కోసం మాట్లాడటానికి మరియు బలహీనంగా ఉన్నవారి జీవితాన్ని రక్షించడానికి పిలువబడుతారు . ఈ సమగ్ర పిలుపు మనకు లభించే ఆశీర్వాదాలు, హక్కులు, సంపద మరియు శక్తి మనది మాత్రమే కాదు అని గ్రహించడానికి ఒక గొప్ప జ్ఞాపిక ; మాట్లాడటానికి, రక్షించడానికి లేదా తమను తాము రక్షించుకోవడానికి శక్తి లేనివారిని ఆశీర్వదించడానికి ఇది దేవుని నుండి వచ్చిన బహుమతి.

నా ప్రార్థన

తండ్రీ, మీ ప్రజలలను రేపండి , దుర్వినియోగానికి గురయ్యేవారికి , విడిచిపెట్టబడిన మరియు దాడి చెయబడిన వారికీ అండగా నిలబడటానికి నన్ను రేపండి . దయచేసి మమ్మల్ని ఉపయోగించుకోండి, ముఖ్యంగా తండ్రి, దయచేసి నన్ను ఉపయోగించుకోండి, ఆ సమయంలో విమోచన శక్తిగా మరియు నేను నివసించే ప్రభావ వృత్తంగా ఉండండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు