ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ముఖ స్తుతి కోసం పడిపోయే మరియు చర్యల కంటే ఉద్దేశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు అనిపించే ప్రపంచంలో, థెస్సలొనీక శిష్యుల విశ్వాసం, నిరీక్షణ మరియు ప్రేమ సహజంగా కొన్ని చర్యలను ఉత్పత్తి చేస్తాయని పౌలు ఆశించడం - మరియు కృతజ్ఞతలు చెప్పడం మీకు ఉత్తేజముగా అనిపించలేదా: విశ్వాసం పనిని ఉత్పత్తి చేస్తుంది. ప్రేమ శ్రమను ప్రేరేపిస్తుంది. ఆశ ఓర్పును ప్రేరేపిస్తుంది. ఈ కొత్త క్రైస్తవులు శిష్యత్వం యొక్క శాశ్వతమైన మూడు సద్గుణాలలో రాణిస్తున్నారు (1 కొరింథీయులు 13:13), మరియు ఈ సద్గుణాలు వారి పని, శ్రమ మరియు ఓర్పుకు దారితీస్తున్నాయి!

నా ప్రార్థన

విమోచకుడవగు అద్భుత దేవా, నేను గమనించదగ్గ విశ్వాసం, ఆశ మరియు ప్రేమ నిండిన జీవితాన్నీ కలిగి నేను మిమ్మిను గౌరవించాలని కోరుకుంటున్నాను. నీ కృప మరియు స్వభావము ప్రేరేపించే క్రియలన్నింటిచే నా జీవితం సంపూర్ణముగా పూర్తవునట్లు దయచేసి నీ పరిశుద్ధాత్మతో నన్ను పునరుద్ధరించండి మరియు ఉపశమనం కలిగించండి . యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు