ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

వినాశనం ముగిసిన 70 సంవత్సరాల తరువాత, దేవుడు వారిని విడిపించి పునరుద్ధరిస్తాడని యిర్మీయా దేవుని ప్రజలకు చెబుతున్నాడు. వారు పదేపదే దేవుణ్ణి విడిచిపెట్టినప్పటికీ, అతను వారిని లేదా వారికి ఇచ్చిన వాగ్దానాలను విడిచిపెట్టడు. అతను నమ్మకంగా ఉంటాడు. నిజానికి, దేవుడు వారికి ఉజ్వల భవిష్యత్తును గురించిన ప్రణాళికను సిద్దపరుచుచున్నాడు . మన వ్యక్తిగత చీకటి,ఎంత లోతుగా అనిపించినా, దేవుడు మన కోసం ప్రణాళికలు కలిగి ఉన్నాడు అని ఈ వాగ్దానం మనకు జ్ఞాపకము చేయుచున్నది . ఆయన తన వాగ్దానాలను నిలబెట్టుకుంటాడు . ఆయన మనలను విడుదల చేసి ఆశీర్వదిస్తాడు. ఆయన విశ్వసనీయత మరియు ప్రతి ఒక్కరి నుండి మనలను విడిపించే ఆయన కుమారుడైన యేసుపై మనకున్న నమ్మకం వల్ల మనకు శక్తివంతమైన నిరీక్షణ మరియు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది.

నా ప్రార్థన

యెహోవా, నేను అలసిపోయాను, నిరుత్సాహపడ్డాను మరియు నలగగొట్టబడ్డాను . మీ గొప్ప వాగ్దానాలపై నమ్మకం ఉంచడానికి నన్ను ప్రేరేపించండి. యెహోవా, నా విశ్వాసం కదిలినప్పుడు నాకు ధైర్యం ఇవ్వండి. మీ వాక్యము ఎంత సవాలుగా అనిపించినా లేదా నేను ఎంత నిరుత్సాహపడినా దానిని పాటించడంలో నాకు సహాయపడండి. నాకు యేసులో ఉజ్వల భవిష్యత్తు ఇచ్చినందుకు ధన్యవాదాలు. దయచేసి ఈ గొప్ప బహుమతి గురించి మరింత స్పృహతో జీవించడానికి నాకు సహాయం చెయ్యండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు