ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

వెదకుడి ! ఈ వాక్యభాగములో దృష్టి నిలపవలసిన పదం అది. ఈ పదం ఒక బలమైన పదం, దానిని మన స్వంతం చేసుకోవటానికి అది ఏదో ఒక ఉద్వేగభరితమైన ప్రయత్నాన్ని వివరిస్తుంది. రాజ్యం, మరియు ఈ రాజ్యంలో ఉన్నవారి నీతి అనేది కేవలము మన కోరిక, మన ఆశ, మన కల కాదు - అది మన అభిరుచి. మనము దానిని ఎంత మూల్యముతోనైనా కొనసాగిస్తాము. మనము దానిని ఒక అభిరుచిగా కొనసాగిస్తాము. ఇది మన స్వంతం చేసుకునే వరకు, లేదా ఇంకా మంచిగా, మన ఇంటిని కనుగొనే వరకు ఇది మనలను దహించే ప్రయత్నం అవుతుంది!

నా ప్రార్థన

ప్రియమైన దేవా, మీ రాజ్యం మరియు మీ స్వభావం పట్ల నాకున్న మక్కువను పక్కకు నెట్టివేసినందుకు నన్ను క్షమించు. ప్రతి ఉదయం మీ పని పట్ల మక్కువతో మరియు ఆ రోజు మీ సంకల్పంతో నన్ను మేల్కొల్పండి. తండ్రీ, నేను ఆశకలిగిన అన్వేషకుడిగా ఉండాలనుకుంటున్నాను, దయచేసి మీ రాజ్యమును నా ఇల్లుగా చేసుకునే వరకు ఆలుపెరగనివానిగా చేయండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు