ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనము విడిపించబడ్డాము! దేవుని దయ మరియు ఆయనపై మనకున్న విశ్వాసం ద్వారా క్రీస్తు యేసు మనల్ని ధర్మశాస్త్రం , పాపం మరియు మరణం నుండి విడిపించాడు (రోమా 8:1-4). మనము ధర్మశాస్త్రమునకు కట్టుబడి ఉండటం ద్వారా నీతిమంతులమని తీర్చబడ ప్రయత్నించకుండా విడిపించబడ్డాము. యేసు మనపై కుమ్మరించిన రక్షణలో పాలుపంచుకోవడానికి పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని పొందిన ఆయన కృపకు మన కృతజ్ఞతతో మనం ఇప్పుడు దేవునికి సేవ చేస్తున్నాము (తీతు 3:3-7). కాబట్టి మనం ఈ స్వేచ్ఛను ఎలా ఉపయోగిస్తాము? మనం ఇప్పుడు పాపం లేదా ధర్మశాస్త్రము పాటించడం ద్వారా మరల దాస్యమను కాడిక్రింద చిక్కుకొనకుండా చూసుకోవాలి ! బదులుగా, మనం పరిశుద్ధాత్మ శక్తితో జీవిస్తాము, తద్వారా మనం "ధర్మశాస్త్రం యొక్క నీతియుక్తమైన ఆవశ్యకతను" నెరవేర్చినప్పుడు మనం మరింత ఎక్కువగా యేసులాగా మారవచ్చు (2 కొరింథీయులు 3:18; గలతీయులు 5:22-25). "శరీరమును అనుసరించి జీవించవద్దు, ఆత్మను అనుసరించి జీవించుము" (రోమా 8:4).

నా ప్రార్థన

స్వేచ్ఛ మరియు దయగల దేవా , దయచేసి మీరు నన్ను ఆశీర్వదించిన అన్ని మార్గాలను మరింత పూర్తిగా అర్థం చేసుకోవడానికి మీ జ్ఞానపు ఆత్మను నాకు ఇవ్వండి. దయచేసి మీ దయను నా కుటుంబం మరియు స్నేహితులతో పంచుకోవడానికి ఆ ఆశీర్వాదాలను ఉపయోగించడంలో నాకు సహాయపడండి. వారికి ప్రదానము చేసిన బహుమతులను నేను తీసుకోనను లేదా ఇంత గొప్ప ఖర్చుతో పొందిన నా స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకొనను గాక . యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు