ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ఎంత అందమైన చిత్రం! మనకోసం చనిపోయినవాడు మనల్ని పోషించి, ఉత్తేజపరుస్తాడు . ఎవరిమీదనైతే సమస్త శాశ్వితత్వం అతుకబడివుంటుందో అయన వ్యక్తిగతంగా మనల్ని ఓదార్చడానికి ఒక సమయం ఉంటుంది . మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచు చున్నాను అని పౌలు చెప్పియున్నాడనుటలో ఏమాత్రము ఆశ్చర్యములేదు! (రోమన్లు ​​8:18)

నా ప్రార్థన

తండ్రియైన దేవా మరియు సమస్త సృష్టి యొక్క సార్వభౌమ ప్రభువా , నా పట్ల మీకున్న అద్భుతమైన ప్రేమకు ధన్యవాదాలు. మీ అధిక మరియు ఉదార కృపకు నేను అర్హుడిని కాదని నాకు తెలుసు, నేను దాని యందు సంతోషించుచున్నాను. నిన్ను గౌరవించడంలో నా ఉత్తమ ప్రయత్నాలు నాకు తెలుసు, మీ సన్నిధిలోకి నన్ను స్వాగతిస్తానని, నన్ను జాగ్రత్తగా చూసుకుంటానని మరియు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నన్ను ఓదార్చుతానని వాగ్దానం చేసినందుకు ధన్యవాదాలు. ప్రభువా , నీ ప్రేమ నా అవగాహనకు మించినది మరియు నా హృదయాన్ని ఆశ్చర్యంతో మరియు ప్రశంసలతో నింపినప్పుడు నాలో నుండి నిన్నుగూర్చిన కీర్తన బయటికి వెలువడుచున్నది. యేసు నామంలో నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు