ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనల్ని మనం ధనవంతులము కాము అనుకోవడం చాలా సులభం. కానీదిగువ రేఖన వున్నను, నేడు ఇ-మెయిల్ చదవడానికి మనకు కంప్యూటర్‌ అందుబాటులో ఉంటే, మనము ప్రపంచంలోని చాలా మంది కంటే ధనవంతులం. మన విశ్వాసం మరియు కరుణ యొక్క మార్గములోకి మన " అనవసరాలు అనే అంశాలు" రావడానికి అనుమతించనివ్వకండి. దేవుడు మన ఒంటెలకు సూది కన్ను ద్వారా వెళ్లడానికి సహాయం చేయాలనుకుంటున్నాడు. మన దగ్గర ఉన్నది ఆయన నుండి వచ్చిన బహుమతి అని, ఇతరులను ఆశీర్వదించడానికి మరియు ఆయనను గౌరవించటానికి దానిని ఉపయోగించాలని ఆయనఉద్దేశించినట్లుగా గుర్తుచేసుకోనగలిగితే అయన దాని చేయగలడు .

నా ప్రార్థన

జాలిగల తండ్రి , డబ్బు సమస్యల గురించి కొంత ఆందోళన చెందకుండావుండటము నాకు చాలా కష్టం. నేను గొప్పగా ఆశీర్వదించబడ్డానని మరియు చాలా నాకు ప్రయోజనాలు ఉన్నాయని నాకు తెలుసు. కానీ తండ్రీ, నేను కలిగి ఉన్న వస్తువుల యాజమాన్యంలో అధీనములో ఉండటానికి నేను ఇష్టపడను మరియు నా దగ్గర లేనిదాన్ని సంపాదించడానికి ప్రయత్నించడం ద్వారా నేను పక్కకు తప్పుకోవటానికి ఇష్టపడను. దయ, ఔ దార్యం మరియు కృతజ్ఞతలో ధనవంతునిగా ఉండడానికి మరియు మీరు నన్ను ఆశీర్వదించడానికి ఎంచుకున్నదానితో కృతజ్ఞతకలిగి ఉండడానికి చూస్తుండగా దయచేసి నాకు సహాయం చెయ్యండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు