ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

"గౌరవనీయులుగా ఉండటం": మనం పురుషులమైనా, స్త్రీలమైనా, మన జీవితాలకు ఇది ఎంత గొప్ప లక్ష్యం! మితమైన (భక్తిగల), ఆత్మనిగ్రహం గల, నమ్మకమైన, ప్రేమగల, మరియు స్థిరమైన జీవితంలో మీ విశ్వాసం వ్యక్తమవడం ద్వారా, మీ జీవితం దేవుని స్వభావాన్ని ప్రతిబింబించాలని మీరు కోరుకోవడం లేదా? దేవుని కుటుంబంలోని ఇతరుల సమక్షంలో జీవిస్తూ, వారిపై ప్రభావం చూపుతున్నప్పుడు, పెద్దవారైన పురుషులు ఈ స్వభావ లక్షణాలను నిజాయితీగా ప్రదర్శించేలా తిమోతి వారిని ప్రోత్సహించాలని పౌలు కోరుకుంటున్నాడు. అటువంటి స్వభావం మన జీవితాలలో పరిశుద్ధాత్మ చేసే కార్యమే (గలతీయులకు 5:22-23) మరియు మనం క్రీస్తును పోలి ఉండటానికి మనల్ని మనం అంకితం చేసుకుని, మనలో దేవుడు చేసే రూపాంతర కార్యము కొరకు పరిశుద్ధాత్మకు మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు మాత్రమే అది వ్యక్తమవుతుంది (2 కొరింథీయులకు 3:18). మనం వృద్ధులమవుతున్న కొద్దీ, మన వృద్ధాప్యంలో సుఖంగా జీవించడానికి మన ఆర్థిక పెట్టుబడులను భద్రపరచుకోవడం గురించి తరచుగా ఆందోళన చెందుతాము. మనం వృద్ధులమవుతున్నప్పుడు, మనం యేసుకు సమర్పించుకోవాలనేదే అపొస్తలుడైన పౌలు యొక్క ఆందోళన, తద్వారా మనలో దేవుడు చేసే రూపాంతర కార్యం ఆయన సేవకు మరియు మన చుట్టూ ఉన్నవారికి మనల్ని మరింత విలువైనవారిగా చేస్తుంది!

నా ప్రార్థన

తండ్రీ, పరిశుద్ధాత్ముడు నాలో నీ రూపాంతర కార్యమును జరిగించుచుండగా, యేసునందు నా విశ్వాసమును బలపరచుము. నా కోరికలు, మాటలు, నా ప్రవర్తన, కోపం, దయ మరియు అలవాట్లను నేను మరింతగా అదుపులో ఉంచుకొనేలా దయచేసి నాకు సహాయం చేయుము. నాలోని ఆత్మీయ ఉత్సాహాన్ని దోచుకొని, నా చుట్టూ ఉన్నవారికి మేలు చేయాలనే నా ప్రభావాన్ని విషపూరితం చేసే వాటిని నేను నిర్మూలించేలా నాకు సహాయం చేయుము. నేను ఇతరులను ప్రేమతో చూసేందుకు ప్రయత్నిస్తూ, కష్ట సమయాలలో విశ్వాసంలో నిలకడగా ఉండేందుకు నా విశ్వాసాన్ని బలపరచుము. యేసు నామములో, మరియు నేను ఆయనను పోలి ఉండేలా రూపాంతరం చెందాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు