ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దేవునికి మనల్ని మనం అర్పించుకోవడం అంత సులభం కాదు ఎందుకంటే మనం మొదట మన స్వార్ధానికి చనిపోవాలి. మనము మన స్వంత సిలువను ఎదుర్కొంటున్నాము. గెత్సేమనే తోటలో యేసు చేసినట్లుగ ప్రియమైన తండ్రీ "అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక" అని ఏడవవలసినవారమైయున్నాము.

నా ప్రార్థన

ప్రియమైన తండ్రీ, యేసును నా రక్షకునిగా పంపినందుకు ధన్యవాదాలు. ప్రభువైన యేసు, నేను నిన్ను అనుసరించాలనుకుంటున్నాను. అది సగం మనసుతో లేదా కపటంగా ఉండటానికి నేను ఇష్టపడను. మీ జీవితం నాలో కనిపించాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి దయచేసి, నా హృదయములో మృదువుగా చేయాల్సిన ప్రాంతాలను నాకు చూపించండి మరియు నా చుట్టూ ఉన్నవారికి మీ మహిమ , దయ మరియు స్వభావాన్ని నేను సంపూర్ణంగా ప్రతిబింబిచునట్లు నా స్వభావమును మీ ఆత్మ ద్వారా మలచాల్సిన అవసరం ఉంది, యేసు నామంలో ప్రార్థిస్తున్నాను . ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు