ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ఇది చాలా సరళంగా మరియు సూటిగా అనిపిస్తుంది, కాదా? ఇది మనకు తెలియని వారు ఎవరైనా చనిపోతున్నారని చెప్పే వార్తాపత్రిక శీర్షిక వంటిది. ఇవి కేవలం చల్లని, కఠినమైన వాస్తవాలు! కానీ మనకు ఇవి భిన్నంగా తెలుసు. ఈ దయతో కూడిన ప్రకటన క్రింద దేవుని విరిగిన హృదయం, పరలోకపు త్యాగం, మత పురుషుల క్రూరత్వం మరియు క్రూరమైన "మరణాధిపతి " కు మనలను విడిచిపెట్టని మన దేవుని శోధించు ప్రేమ ఉంది. జంతువుల బలిని గూర్చి తెలిసినవారికి, దానిలోని వ్యయం మరియు జంతు బలులను ఎరిగినవారికి, ఈ వాక్యం ప్రధాన శీర్షిక కంటే కూడ కొంత ఎక్కువే : ఇది "దయను తెలుపు ఒక సూచి ". అందరికీ ఒకసారి లభించినది - ఇక త్యాగాలు అవసరం లేదు. నిన్ను దేవుని దగ్గరకు తీసుకువచ్చుటకు - ఎక్కువ దూరం లేదు, దేవునికి మరియు మన మధ్య మధ్యవర్తులు లేరు. యేసే పరలోకపు ద్వారము మరియు దేవుని తెరువబడిన హృదయం, "ఇంటికి రండి; మేము మీ కోసం ఎదురుచూస్తున్నాము."

నా ప్రార్థన

దయగల తండ్రీ, నీ త్యాగం మరియు దయ పట్ల నా ప్రశంసలను వ్యక్తపరచటానికి నేను ఏ పదాలను ఉపయోగించగలను? నేను ఏమనుకుంటున్నానో చెప్పడానికి నాకు ఏదీ లేదు. కానీ ఈ సాక్షాత్కారంలో కూడా, మీ ఆత్మ యొక్క బహుమతి మీరు నా మాటలను మరియు నా హృదయాన్ని వింటున్నట్లు నిర్ధారిస్తుందని నాకు తెలుసు. నేను కలిగి ఉన్న ప్రతి మంచి మరియు శాశ్వతమైన విషయం నీ దయ నుండి వచిన్నది . దయచేసి మీరు చేసిన అన్నిటికీ, మరియు మీరు చేయబోవువాటికి నా అంతులేని ప్రేమను మరియు నా హృదయపూర్వక ప్రశంసలను స్వీకరించండి. యేసు విలువైన పేరులో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు