ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

పరిశుద్ధాత్మ దేవుని శాశ్వతమైన వరం, దేవుని ముద్ర, మన అభిషేకం, మరియు మన భవిష్యత్ మహిమ వాగ్దానం.* యేసు బలియాగ మరణంతో మరియు విశ్వాసం, బాప్తిస్మం ద్వారా మనం దానిలో పాలుపంచుకోవడంతో దేవుడు ప్రారంభించిన దానిని, యేసు తిరిగి వచ్చినప్పుడు ఆయన పరిపూర్ణం చేస్తాడనే హామీయే ఈ పరిశుద్ధాత్మ. కానీ, లేఖనాల్లోని చాలా విషయాలను లోకం అర్థం చేసుకోలేనట్లే, ఈ గొప్ప వాగ్దానాన్ని కూడా లోకం అర్థం చేసుకోలేదు. పరిశుద్ధాత్మ వరం లేకుండా, వారి కళ్ళు తమ వేళ్ళతో తాకగలిగిన దానిని మాత్రమే చూడగలవు కానీ, దేవుని హృదయంలో ఉన్న సత్యాన్ని మరియు దేవుడు తన వాక్యంలో బయలుపరిచిన దానిని పూర్తిగా చూడలేవు. * పరిశుద్ధాత్మ గురించి చెప్పబడిన విషయాలు, యోహాను 14:18-23; రోమా 8:9-39; తీతు 3:3-7; 2 కొరింథీ 1:22; ఎఫెసీ 1:13; మరియు 1 యోహాను 2:20, 26-27 వంటి లేఖనభాగాలలోని స్పష్టమైన ప్రకటనల ద్వారా స్పష్టమవుతున్నాయి.

నా ప్రార్థన

తండ్రీ, యేసును పంపినందుకు నీకు వందనాలు. యేసూ, ఆత్మను పంపినందుకు నీకు వందనాలు. ఆత్మా, నన్ను ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టనందుకు నీకు వందనాలు. ఓ ప్రభూ, నేను ఆత్మతో నింపబడినట్లే, యేసులో వ్యక్తమైన నీ ఆకాంక్షలను, నీ స్వభావాన్ని నా సంకల్పం, నా జీవితం మరింత పరిపూర్ణంగా ప్రతిబింబించేలా నన్ను ఇంకా ఎక్కువగా నింపు. నీ సన్నిధి ఇప్పుడు నన్ను ఆశీర్వదిస్తున్నట్లే, ఇతరులను ఆశీర్వదించడానికి నన్ను ఉపయోగించు. యేసూ, నీ ఆత్మను మాపై కుమ్మరించినందుకు నీకు వందనాలు. ఇప్పుడు, మా కోసం నీకున్న అద్భుతమైన ప్రణాళికలను ఇతరులు తెలుసుకునేలా, నీ రక్షణ వరాలను, ఆత్మను వారితో పంచుకోవడానికి దయచేసి మమ్మల్ని ప్రోత్సహించు! నీ నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు