ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనము మన హృదయంలోకి శ్రద్దగా చూడాలని మరియు తనను పూర్తిగా అనుసరించకుండా మరియు సేవ చేయకుండా మనలను నిలిపివేయువాటిని తనకు లోపరచాలని యేసు కోరుకుంటున్నాడు . అవి ఏమిటో మనకు తెలుసు. అతను ఇప్పుడు మేకులు గుచ్చబడిన తన గాయాల చేతులతో మన వద్దకు వస్తాడు మరియు మనలను విమోచించడానికి అతను ప్రతిదీ వదులుకున్నాడని గుర్తుచేస్తున్నాడు . మనలను వెనక్కి నెట్టే వాటిని మనం ఇప్పుడు సిలువకు అప్పగించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈరోజు అది చేద్దాం!

నా ప్రార్థన

తండ్రివైన దేవా , సర్వశక్తిమంతుడైన రాజా , నీ ఆత్మ నాలో పెంపొందించడానికి పనిచేస్తున్న నీతి నుండి నేను దాచి ఉంచిన నా జీవిత ప్రాంతాలను బట్టి నన్ను క్షమించండి. నేను ఇప్పుడు పాపం యొక్క రహస్య ప్రాంతాలను మీకు ఒప్పుకుంటున్నాను మరియు మీరు నన్ను శుభ్రపరచాలని నన్ను బందించి మరియు మీ కుమారుడికి పూర్తి హృదయపూర్వక సేవ నుండి నన్ను నిలుపుచున్న సాతాను శక్తి నుండి నన్ను విముక్తం చేయమని అడుగుచున్నాను .యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు