ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మీకు ఆనందాన్ని కలిగించేది ఏది? మీ వ్యక్తిగత అతిశయానికి మూలమేది?మీ విజయాలు, మీ సంపద, మీ స్థితి, మీ చూపులు , మీ భక్తి, మీ వినయం ... మొదలుగునవాటిలో మీరు అతిశయాన్ని మరియు ఆనందాన్ని కలిగివున్నారా? "యేసు శిలువ క్రింద" అనే పాత శ్లోకంలోని, "నా సమస్త మహిమ( అతిశయము), శిలువయే " అని అంగీకరిస్తున్నాము. మనం "దేవుని పవిత్ర నామంలో అతిశయం " అని అన్నపుడు క్రైస్తవుల అర్ధం కూడా అదియే . దేవుని పవిత్ర నామం గురించి మన పూర్తి అవగాహన యేసుచే బాగా విస్తరించబడింది . దేవుని నామాన్ని గౌరవించడమే కాదు, ఆయనను తండ్రి అని పిలుచుట కూడా నేర్పించాడు . మన ఆనందానికి మరేదైనా కారణంమైనా, ప్రగల్భాలకు మరే ఇతర ఆధారమైనా , అవి కేవలం సాగిపోతున్న భ్రమవంటివి మాత్రమే . ఎవరి హృదయాలైతే యెహోవాను వెతుకుతున్నవో వారికి మనము అతని పిల్లలము అగునట్లు తన విలువైన కుమారుడిని విడిచిపెట్టిన తండ్రి పవిత్ర నామాన్ని గౌరవించడంలోనే ఆ కీర్తి అతిశయము కనిపిస్తుంది. ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు . ఇది ఎంత సాటిలేని విషయమో!

నా ప్రార్థన

తండ్రీ, మీరు నన్ను చాలా విధాలుగా ఆశీర్వదించారు. నేను మీకు సరిగ్గా కృతజ్ఞతలు చెప్పడం ఎలా? నేను కొన్నిసార్లు నా కోసం ఖ్యాతిని మరియు కీర్తిని కోరుకుంటాను అయినప్పటికీ తరచూ ఇది నా నుండి ఏదైనా కోరుకునే వారి తప్పుడు ముఖస్తుతి మాత్రమే అని నాకు తెలుసు . కానీ నా హృదయంలో లోతుగా, ప్రియమైన దేవా, నీ కృపతో మీరు సంతకం చేసిన దత్తత నిబంధనలో నా నిజమైన అతిశయము ఉందని నాకు తెలుసు. ధన్యవాదాలు! పదాలు నీకొరకైన నా ప్రశంసలను అందుకోలేవు, కాని దయచేసి మీరు చేసిన సమస్తమునకు నేను నిత్య కృతజ్ఞతతో ఉండాలని ఎదురుచూస్తున్నానని తెలుసుకోండి. పరలోకంలో మరియు భూమి అంతటా, యుగయుగాలలో కీర్తి మీదే. యేసు నామంలో నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు