ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

బాప్తిజంలో, మనము క్రీస్తు మరణంతో ఐక్యంగా ఉన్నాము (ఈ వాక్యభాగం యొక్క నేపథ్యం కోసం రోమా ​​6: 1-14 చూడండి). మన పాత పాపపురుషుడు క్రీస్తుతో సిలువ వేయబడ్డాడు. మనం ఇక పాపానికి బానిసలం కాదు. మనము క్రీస్తులో - పాపం సాధించలేని మరియు మరణం జయించలేనివానీలో సజీవంగా ఉన్నాము . అతని జీవితం ఇప్పుడు మన జీవితం. ఆయన విజయం మన విజయం. ఆయన భవిష్యత్తు మన భవిష్యత్తు. ఈ నిశ్చయత ఆధారంగా జీవించడానికి మన హృదయాలను సిద్దపరుచుకుందాము!.

నా ప్రార్థన

దయగల తండ్రీ, మీరు నా గత పాపములన్నిటినీ మీ సిలువ వేయబడిన కుమారుడి సమాధిలో ఉంచి, ఆయనలో నన్ను కొత్త జీవితానికి లేవనెత్తారు . యేసులో అర్ధం, ఆనందం మరియు విజయాన్ని కనుగొనడానికి నన్ను ప్రేరేపించండి. నీ ఆత్మతో నన్ను బలోపేతం చేసి, నా ప్రభువుకు నన్ను మరింత సంపూర్ణంగా అనుగుణంగా మార్చండి. నా పాపం అంతా చనిపోయిందని, సమాధి చేయబడిందని, పోయిందని పూర్తిగా నమ్ముతూ జీవించడానికి నాకు అధికారం ఇవ్వండి. దయచేసి నా క్రొత్త జీవితం యేసుతో మరియు అతని భవిష్యత్తుతో ముడిపడి ఉందని నాకు నమ్మకం ఇవ్వండి. యేసు, ఈ నీరిక్షణకు నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరియు మీ నామములో ఈ మహిమను అర్పిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు