ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

విరిగిన హృదయము కలిగినవారము కాబట్టి మనము ఆదరణను పొందాము . మనకు ఆశీర్వాదము కావాలి కనుకనే మనము ఆదరణను పొందాము. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము ఆదరణను పొందాము,ఇతరులకు ఈ ఆదరణ పంచడానికి మనము ఆదరణను పొందాము. పైన చెప్పబడిన మాటలు ప్రతి ఒక్కటి నిజమైవుండగా , చివరిది అత్యంత కీలకమైనది. వేరొకరితో పంచుకునే వరకు పూర్తిగా గ్రహించలేని ఆదరణలో ఏదో గొప్ప విషయము దాగి ఉంది. శోకములో వున్న, నిరాశతో వున్న, బాధింపబడిన మరియు నష్టపడిన వారికి అందించే స్వస్థత ప్రక్రియలో ఇది చివరి దశ. మనం పొందిన ఆదరణను పంచుకునే వరకు, దానిని మరొకరికి అందించే వరకు, మన ఆదరణను బలహీనంగా మరియు నిస్సారంగా మరియు పరిమితంగా ఉంటుంది. ఆదరణను ఇతరులకు అందవేయండి !

నా ప్రార్థన

యెహోవా, భూమ్యాకాశములకు దేవా , విశ్వ సృష్టికర్త, నా హృదయాన్ని తెలుసుకున్నందుకు, నా ఆందోళనలను పట్టించుకున్నందుకు మరియు నేను గాయపడినప్పుడు నన్ను ఆదరించినందుకు ధన్యవాదాలు. ఈ రోజు మీ కృప , కరుణ మరియు ఆదరణను వేరొకరితో పంచుకోవడానికి నాకు సహాయం చేయండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు