ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

తరచుగా మనము కృతజ్ఞతలు చెప్పడంతో ముడిపడి ఉన్న నెలలోకి ప్రవేశించినప్పుడు మనము కృతజ్ఞతలు తెలుపుతూ మనకున్న వాటిని ఇతరులతో పంచుకోనుచు, మోషే నుండి వచ్చిన ఈ జ్ఞాపకం ఎంతో ముఖ్యమైనది గా ఉంటుంది ! పరిస్థితులు బాగా జరుగుతున్నప్పుడు కృతజ్ఞతలు చెప్పడం చాలా సులభం. మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకు సహాయం చేయమని దేవునిని కోరడం మరియు అడగడము మనకు చాలా సులభం, మనకు జరిగే మంచి విషయాలకు మనం "అర్హులమని" భావిస్తాము. కానీ మన దగ్గర ఉన్నది ఆయన కృపకు గురుతు మరియు ఆయన చెప్పినదానిని చేయటానికి ఆయన యెడల మనము చూపే విశ్వాసమని దేవుడు మనకు గుర్తుచేస్తున్నాడు. మనము ఒకరికొకరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది, అది ఏమిటంటే అవి మనకు ఆయన చేతిలో నుండి వచ్చిన ఆశీర్వాదాలు మాత్రమే తప్ప వేరొకరి కంటే మనం అర్హులైనందువల్ల కాదు.

నా ప్రార్థన

ఉదార స్వభావము కలిగిన తండ్రి, నా మతిమరుపును బట్టి నన్ను క్షమించు. నా జీవితంలో మీరు కురిపించిన అన్ని మంచి వస్తువులకు నేను అర్హుడిని కాదని నాకు తెలుసు, అయినప్పటికీ నేను వాటిని సంపాదించానని కొన్నిసార్లు ఆలోచిస్తున్నాను. యేసులాంటి హృదయాన్ని నాలో ఏర్పరచుకోవడానికి మీ ఆత్మను ఉపయోగించుకోండి, అతను ప్రతిదానికీ మంచివాడు, ఇంకా భూమికి వచ్చి ఊహించదగిన గొప్ప బహుమతిని నాకు ఇచ్చాడు -అదే మీ రక్షణయనే బహుమతి! ఈ కృప బహుమతికి మరియు మీరు నాపై వేసిన అనేక ఇతర ఊహించని బహుమతులకు చాలా ధన్యవాదాలు. యేసు నామంలో మీకు నా ధన్యవాదాలు. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు