ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
మన బాప్తిస్మం నీటిలో మునిగిపోవడం కంటే ఎక్కువ అని పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు. బాప్తిసంలో, మనం యేసు మరణం, సమాధి మరియు పునరుత్థానంలో పాలుపంచుకుంటాము. ఆయన మనల్ని రక్షించడానికి ఏమి చేసాడో, ఇప్పుడు మనం అలాగే ఆయనతో కలిసి పనిచేయగలుగుతాము. మనం పాపము విషయంలొ చనిపోయాము మరియు కొత్త వ్యక్తిగా లేపబడ్డాము, శుద్ధి చేయబడి, పవిత్రంగా చేయబడ్డాము, శక్తివంతం చేయబడ్డాము మరియు పరిశుద్ధాత్మ నివాసమును కలిగియున్నాము . పాపం యొక్క శక్తి మరియు శిక్ష నుండి మరియు మన మర్త్య భౌతిక శరీరాల పరిమితుల నుండి మనం విముక్తి పొందాము. యేసుతో మనకు కలిగిన ఈ అనుభవం మన భౌతిక సంబంధం, ఆయనతో మన భవిష్యత్ ఆధ్యాత్మిక మహిమకు మన హామీ! ఎందుకు అనగా ? "మనం ఆయన మరణంలో ఇలాగే ఆయనతో ఐక్యమయ్యాము కాబట్టి, ఆయన పునరుత్థానంలో కూడా ఆయనతో ఐక్యమవుతాము."
నా ప్రార్థన
తండ్రీ, యేసులో నాకు నూతన జీవితాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. నీ కృప నా అపరాధాన్ని కప్పి, నన్ను పవిత్రంగా చేసి, నా భవిష్యత్తుకు భరోసా ఇచ్చినందుకు నేను నిజంగా కృతజ్ఞుడను. పాపం నుండి స్వేచ్ఛగా నా జీవితాన్ని గడపడానికి పరిశుద్ధాత్మ శక్తిని నేను అడుగుతున్నాను. నా అభిరుచి సామాన్యత మరియు పాపంలోకి జారుకోవడానికి అనుమతించినందుకు దయచేసి నన్ను క్షమించు. నా ఆత్మను కలుషితం చేసే లేదా మీ చిత్తం నుండి నా హృదయాన్ని మరల్చే దేని పట్లనైనా నాకు బలమైన అసహ్యం కలిగించు. నేను పాపానికి బానిసగా ఉండటానికి నిరాకరిస్తున్నాను మరియు నా వాగ్దానం చేయబడిన భవిష్యత్తుపై నా జీవితాన్ని మీతో నిర్మించుకోవాలని ఎంచుకున్నాను. యేసు నామంలో, నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరియు ఈ రోజు నా జీవితాన్ని మీకు తిరిగి అప్పగించుకుంటున్నాను. ఆమెన్.


