ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

యెహోవా దేవుడు. ఆయన పవిత్రతను, శక్తిని మనం తేలికగా తీసుకోకూడదు. కానీ దేవుని దయ యొక్క నమ్మశక్యమైన వాస్తవం ఈ విధముగా ఉంది: సీనాయి పర్వతం మీద ఉరుములతో ఈ విశ్వం గురించి మాట్లాడిన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం ఆయన దగ్గరికి వచ్చి ఆశ్రయం పొందాలని కోరుకుంటున్నాడు. మనం భక్తిపూర్వక భయంతో ఆనందించవచ్చు. పవిత్ర భయముతో స్తుతించవచ్చు. మనం సురక్షితంగా ఉండవచ్చు, ఎందుకంటే మన నమ్మకం మానవులు యందు లేదు , తాత్కాలికమైనదానియందు లేదు ,బలహీనమైనదానియందు లేదు కానీ . యెహోవా మన దేవునీయందు వుంది.

నా ప్రార్థన

తగని మాటలతో, బాధ్యతారహితమైన ప్రవర్తనతో నీ కృపను నేను చౌకబారు చేసిన సమయాలకు నన్ను క్షమించు తండ్రీ. మీరు మాత్రమే దేవుడు. మీరు మాత్రమే ప్రశంసలు అర్హులు. పవిత్రమైనది మరియు శక్తివంతమైనదిగా ఉండటమే కాకుండా, సమీపంలో ఉండటం మరియు నాకు ఆశ్రయం మరియు రక్షణ స్థలాన్ని అందించినందుకు ధన్యవాదాలు. ప్రియమైన తండ్రి, దేవుడుగా ఉన్నందుకు ధన్యవాదాలు! యేసు నామములో ప్రార్థిస్తున్నాను . ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు