ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనము దేవుని స్వరూపంలో తయారయ్యాము. మనిషి మాత్రమే కాదు. స్త్రీ మాత్రమే కాదు. స్త్రీ, పురుషుడు ఇద్దరూ దేవుని స్వరూపంలో నిర్మించబడ్డారు! నమ్మశక్యం, ఇది ఆదాము పతనానికి ముందు మాత్రమే నిజం కాదు. దేవుడు మన తల్లుల గర్భంలో మనలను సృష్టించినప్పుడు (కీర్తన 139: 13-16), ఆయన మనలను తన స్వరూపంలో చేసాడు (ఆదికాండము 9: 6). ప్రజలు దేవునికి విలువైనవారు కాబట్టి, మన సృష్టికర్త యొక్క స్వభావమును మనం ప్రతిబింబిస్తాము కాబట్టి, ప్రతి వ్యక్తి విలువైనవారి గా ఉండాలి. ఎవరూ తిరస్కరించబడరాదు, తక్కువ చేయబడరాదు లేదా శపించబడరాదు (యాకోబు 3: 9-12). ప్రజలు దేవునికి మాత్రమే కాదు, మనకు కూడా విలువైనవారు ఎందుకంటే కొన్ని ప్రత్యేకమైన పద్ధతిలో వారు ఆయన ప్రతిరూపాన్ని ప్రతిబింబిస్తారు

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడా తండ్రీ, మీ సృష్టి యొక్క అందాలను చూడటానికి నాకు సహాయం చెయ్యండి. వ్యర్ధమైనవాటి నుండి నన్ను రక్షించండి. మీరు నన్ను ఉదారంగా ఆశీర్వదించి ఇచ్చిన సహజ వనరులను సరైన రీతిగా ఉపయోగించడానికి నన్ను నడిపించండి. అన్నింటికంటే, మీ సృష్టిని నేను ప్రభావితం చేసే విధంగా నా నిర్ణయాలను నిర్దేశించండి. నా జీవనశైలి మరియు నా వ్యక్తిగత జీవితం నా ప్రపంచంలో మీ స్వరం అందాన్ని ఎప్పుడూ దెబ్బతీయనివ్వకండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు