ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దేవుని అద్భుతాన్ని మనం గ్రహించడానికి ఎంత ప్రయత్నించినా, ఆయనే ఇప్పటికీ దేవుడే కానీ మనం కాదు. జ్ఞానం మరియు అవగాహన పరంగా మనము దేవుని వలె మారడానికి ప్రయత్నించడమే ఇప్పటికీ అసలైన మరియు ప్రాథమికమైన పాపం అని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. మనం దేవుణ్ణి తెలుసుకోవాలి, కానీ ఆయన గురించిన ప్రతి విషయాన్ని మనం ఎప్పటికీ పూర్తిగా తెలుసుకోలేము. మనం అతని స్వభావమును ధరించాలి, కానీ మనం అతని ఘనత, నీతి లేదా పవిత్రతను మన స్వంతంగా చేరుకోలేము. ఇది ఉత్తేజకరమైనది మరియు కొంత నిరాశపరుచునది . కానీ, ఒకరోజు మనం ఆయనలా ఉంటాం మరియు ఆయనను ఆయనలానే చూస్తాం (1 యోహాను 3:1-3) మరియు అప్పుడు మనము పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదుము . (1 కొరింథీయులు 13:11-12) అనే వాగ్దానం మిగిలి ఉంది.

నా ప్రార్థన

మా మంచి కాపరి , మీ పవిత్రమైన మరియు అతీతమైన స్వభావమును నేను పూర్తిగా అర్థం చేసుకోలేనప్పుడు మరియు అభినందించలేనప్పుడు నాతో చాలా ఓపికగా ఉన్నందుకు ధన్యవాదాలు. యేసును పంపినందుకు ధన్యవాదాలు, తద్వారా నేను మిమ్మల్ని బాగా తెలుసుకోగలను మరియు నా గురించి నాకు తెలిసిన దానికంటే బాగా తెలుసునని మీరు విశ్వసిస్తాను. యేసు నన్ను ఇంటికి తీసుకురావడానికి వచ్చినప్పుడు మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని నేను ఎదురు చూస్తున్నాను. ఆ రోజు వరకు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని దయచేసి తెలుసుకోండి. యేసు నామంలో నేను నా కృతజ్ఞతలు మరియు ప్రశంసలను సమర్పిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు